వెండ్లూరు పాడు గ్రామంలో గుర్తు తెలియని వ్యక్తులు శిలాఫలకాలు ధ్వంసం ః. సూళ్లూరుపేట డివిజన్ ఇంచార్జ్ తడ మండలం (ఇది నిజం ప్రతినిధి )
తిరుపతి జిల్లా సూళ్లూరుపేట నియోజకవర్గం తడ మండలం వెండ్లూరుపాడు గ్రామంలో నూతనంగా వేసిన సిమెంట్ రోడ్డు వివరాలు పొందుపరిచిన శిలాఫలకాన్ని గుర్తు తెలియని వ్యక్తులుధ్వంసం చేశారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రతి గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది పల్లె పండుగ కార్యక్రమంలో భాగంగా వెండ్లూరుపాడు గ్రామంలో రెండు విడతలగా సుమారు 20 లక్షల వ్యయంతో వెండ్లూరుపాడు దళితవాడ, పొన్నపాడు దళితవాడ, దండుబాడు వద్ద సిమెంటు రోడ్లు వేశారు. అభివృద్ధి కార్యక్రమాల వివరాలను పొందుపరిచేందుకు శిలాఫలకం ఏర్పాటు చేశారు.ఎమ్మెల్యే విజయశ్రీని చేతుల మీదగా సిమెంటు రోడ్డును ప్రారంభించేందుకు వేచి చూస్తున్న తరుణంలో గుర్తు తెలియని వ్యక్తులు శిలాఫలకాన్ని ధ్వంసం చేశారు. అభివృద్ధి కార్యక్రమాలు చూసి ఓర్వలేక ప్రతిపక్ష పార్టీ వ్యక్తులు చేశారాఆకతాయిలు చేసి ఉంటారా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి కానీ రెండు వేరువేరు ప్రాంతాలలో ఒకేరోజు శిలాఫలకాలు ధ్వంసం కావడంతో కక్షపూరితంగానే చేసినట్టు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.