ePaper
Saturday, April 11, 2026
ప్రకటనల కోసం సంప్రదించండి
📄 ePaper
Homeఎడిటోరియల్విమ‌ర్శ‌ల‌కు నైతిక‌త ఉండ‌దా..?*

విమ‌ర్శ‌ల‌కు నైతిక‌త ఉండ‌దా..?*

📰 Generate e-Paper Clip

*విమ‌ర్శ‌ల‌కు నైతిక‌త ఉండ‌దా..?*

 

*ఆరోప‌ణ‌ల‌కు క‌ట్టుబ‌డి ఉండాల్సిన అవ‌స‌రం లేదా..??*

 

*విమర్శలు ప్రతి విమర్శలు, శూన్యమే……*

 

*మర్రిపాడు మండల ప్రజలు:*

 

*మర్రిపాడు(ప్రభాకర్ మేకల //ఇదినిజం బ్యూరో ఇంచార్జ్ ):*

 

 

రాజకీయాలన్నాక విమర్శలు, ప్రతి విమర్శలు సహజం. అయితే గతంలో ఈ విమర్శలకు, అవినీతి ఆరోపణలకు ఓ నిబద్దత, ఓ నైతికత ఉండేవి. అవి నేటి రాజకీయాలలో కనుమరుగు కావడం శోచనీయం. మర్రిపాడు మండలంలో గత రెండు రోజుల నుండి అధికార ప్రతిపక్ష మండల నాయకులు ఒకరి పైఒకరు చేస్తున్న ఆరోప‌ణ‌లు

శ్రుతిమించుతున్నాయి. ఒకరి లొసుగులు ఒకరు బ‌హిర్గ‌తం చేసేందుకు ఉత్సాహం చూపిస్తున్నారు.

కాని నైతిక‌త లేని విమర్శలు కట్టుబాటు లేని ప్రతి విమర్శలు శూన్యమే నని మర్రిపాడు మండల ప్రజలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మేము గెలిస్తే మర్రిపాడు కు మహర్థశ అని ఎన్నికలు అప్పుడు వచ్చి ఊకదంపుడు ఉపన్యాసాలు చెప్పిన ప్రతి ఒక్కరు గెలిచిన పిదప మర్రిపాడు అభివృద్ధిని కాంక్షించిన నాయకులు లేరనేది విమర్శలు ప్రతి విమర్శలు చేసుకొనే మండల నాయకులకు అవగతమే. మెట్ట ప్రాంతం మర్రిపాడుకు సాగు త్రాగు నీటి ని తెచ్చి మర్రిపాడును సస్యాశ్యామలం చేస్తామని సోమశిల హై లెవల్ కెనాల్ ప్రారంభించి 14 సంవత్సరాలు అయినా సంపూర్ణ దశకు చేరుకొక పోతే పట్టించుకున్న పొలిటికల్ మండల నాయకులు లేరు. చుట్టూ 24 పంచాయితీ లు 56 గ్రామాలతో జిల్లా లో పెద్ద మండలంగా పేరు ఉన్న మండల కేంద్రం మర్రిపాడు లో మహిళ కు మరుగు లేదు ప్రయాణికులకు నిలువ నీడ లేదు మండలంలో చుట్టూ ఒక్క గ్రామానికి బస్సు సౌకర్యం లేదు హై వే ఫై బస్సులు ఆపడం లేదు ఇన్ని కష్టాలు ప్రజలు అనుభవిస్తూ అభివృద్ధి కి ఆమడ దూరంలో మర్రిపాడు మండలం కున్నారిల్లుతుంటే మండల నాయకులు అభివృద్ధి గురించి విమర్శలు ప్రతి విమర్శలు,చేసుకోవడం శూన్యమే నని కలిసి కట్టుగా మండల అభివృద్ధిని కాంక్షిస్తారని మర్రిపాడు మండల ప్రజలు అభిప్రాయం.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular

error: Content is protected !!