👉🏻*సత్యం జి బాలాజీ హైవే లేఅవుట్ లో 1.92 సెంట్లు మఠం, పంచాంగం భూమి*👉🏻*జీవో నెంబర్ 22-A లో ప్రస్తుత హక్కుదారులకు పట్టాలు మంజూరు చేయమని ఉన్న, 1986,1996 పాస్ పుస్తకాలు ఉన్నట్టుగా రికార్డులు*👉🏻*లేఅవుట్ కు అనుమతులు లేకుండానే వేల టన్నుల్లో గ్రావెల్ అక్రమ తరలింపు*👉🏻*దిగువ భాగంలో ఉన్న 350 ఎకరాలకు పంట కాలువను పూడ్చి ప్రహరీ గోడ నిర్మిస్తున్న లేఅవుట్ యాజమాన్యం*👉🏻ఈ లేఅవుట్లో 111-6 లో 1.02 సెంట్లు, 109-4 లో 69 సెంట్లు, 109-5 లో 21 సెంట్లు మొత్తం: 1.92 సెంట్లు పంచాంగం, మఠం భూములు*
తడ.( మం)(ఇది నిజం ప్రతినిధి ) తిరుపతి జిల్లా తడ మండలం గ్రద్ద గుంట పంచాయతీ నందు నూతనంగా వేస్తున్న సత్యం జి రియల్ ఎస్టేట్ లేఅవుట్ కు అనుమతులు లేకుండా అక్రమంగా వేల టన్నుల గ్రాములు తరలించారు. మైనింగ్ అనుమతులు ఉన్నాయంటూ వేల టన్నుల గ్రావెల్ ను అక్రమంగా లేఅవుట్ కు తరలిస్తున్న అటు రెవెన్యూ సిబ్బంది నిమ్మకు నీరు ఎత్తినట్లు వ్యవహరించడం ఆస్యాస్పదంగా ఉంది.ఈ 18 ఎకరాల లేఔట్ లో 1.92 సెంట్ల పంచాంగం సర్వేలో మఠం భూమి ఉందని, ఈ లేఔట్ కు క్రింద భాగంలో 350 ఎకరాల కు నీళ్ల పారుదల కాలవను లేఅవుట్ యాజమాన్యం పూడ్చి వేసి దానిపై ప్రహరీ గోడ నిర్మిస్తున్నారని రైతులు,గ్రామస్తులు తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఈ లేఔట్ లో అక్రమ గ్రావెల్ తరలిస్తున్న, 1.92 సెంట్ల మఠం భూములు కలిసి ఉన్న రెవెన్యూ సిబ్బంది పట్టించుకోకపోవడంపై గ్రామస్తులు విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేస్తున్నారు.గ్రద్దగుంట గ్రామ ప్రజల కోరిక మేరకు ఆ లేఔట్ లో పంచాంగం సర్వేలో మఠం భూమి కలిసి ఉందా లేదా అని సర్వే చేసి మా మఠం భూమి 1.92 సెంట్లు మా గ్రామానికి ఇప్పించాలని గ్రామస్తులు తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.