idhinijam.com
Newspaper Banner
Date of Publish : 12 April 2026, 6:55 am Digital Edition : Idhi Nijam Desk

మూగజీవుల దాహం తీరుస్తున్న జంతు ప్రేమికులు….

మూగజీవుల దాహం తీరుస్తున్న జంతు ప్రేమికులు….ఉల్లాసంగా మునిగితేలుతున్న వానరాలు….

ఇదినిజం.(ఇదినిజం ప్రతినిధి ):ఎండలు మండుతున్నాయి. భానుడి ప్రతాపానికి మూగజీవాలు అల్లాడుతున్నాయి. అడవుల్లో నీటి వనరులు ఎండిపోతుండడంతో జంతువులు దప్పికతో అలమటిస్తుంటాయి. ఈ క్రమంలో వన్యప్రాణుల సంరక్షణకు వేసవి నేపథ్యంలో మూగజీవుల దాహర్తిని తీర్చడానికి ఓ ఆపన్న హస్తం ఆదుకుంది జాతీయ రహదారి వెంబడి మర్రిపాడు నుండి బద్వేల్ మీదుగా గంగుంట వరకు ఐదు ఏర్పాటు చేసిన సిమెంట్ తోట్లలో ట్యాంకర్ సహాయంతో నీటిని నింపుతూ మూగజీవులకు దాహం తీర్చుతున్నారు మర్రిపాడు ఎస్సీ కాలనికి చెందిన జంతు ప్రేమికులు. కన్నెమరకల కుటుంబానికి చెందిన రమణయ్య, రమణయ్య ( RK) పెద్ద నరసింహులు, శ్రీనివాసులు, రత్తయ్య,దండు అశోక్,తొడేటి నరేష్.మార్చి నుంచి ఎండ తీవ్రతతో పాటు ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతుండడంతో అటవీ ప్రాంతాల్లో సహజ సిద్ధమైన నీటి వనరులు అడుగంటిపోతాయి. చెక్‌డ్యాంలు సైతం ఎండిపోయి అటవీ జంతువులకు ఇబ్బందిగా మారుతుంది. అడవుల్లో ఉన్న వృక్షాలు ఆకు రాల్చడంతో సరైన ఆహారం లభించని పరిస్థితి ఉంటుంది. జింకలు, కనుజులు, దుప్పులు, ఎలుగుబంట్లు, కుందేళ్లు, అడవి పందులు, నక్కలు, హైనాలు, ఇతర వన్యప్రాణులు, పక్షుల దాహార్తిని తీర్చేందుకు ప్రతి వారానికి ఒక సారి తోట్లకు నీటి నింపి ఆహారం కోసం అరటి పండ్లు, టమోటా, వేస్తున్నారు ప్రతి వారం ట్యాంకర్ల ద్వారా నీటిని నింపుతుండడంతో వన్యప్రాణులు, జంతువులు, పక్షుల దాహార్తి తీర్చు కుంటూ ఉల్లాసంగా గడుపుతున్నాయి.