idhinijam.com
Newspaper Banner
Date of Publish : 16 August 2026, 5:26 am Digital Edition : Idhi Nijam Desk

మర్రిపాడు విద్యావనరుల కార్యాలయ మెసెంజర్ కన్నెమరకల శ్రీనివాసులు కు విశిష్ట సేవా పురస్కారం…..

మర్రిపాడు.(ప్రభాకర్ మేకల //ఇదినిజం బ్యూరో ఇంచార్జ్ ):

క్లరికల్ సిబ్బంది సేవలను గుర్తిస్తూ జిల్లా విద్యాశాఖ తీసుకున్న అరుదైన నిర్ణయంలో భాగంగా మర్రిపాడు మండల విద్యావనరుల కార్యాలయం నందు మెసెంజర్ గా విధులు నిర్వర్తిస్తున్న కన్నెమరకల శ్రీనివాసులు కి “విశిష్ట సేవా పురస్కారం లభించింది.స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా శనివారం జిల్లా విద్యా వనరుల కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో గౌరవ DEO బాలాజీ రావు చేతుల మీదుగా ఈ పురస్కారాన్ని అందుకున్నారు.శ్రీనివాసులు గత కొన్ని సంవత్సరాలుగా విద్యావనరుల కార్యాలయంలో మెసెంజర్ గా పనిచేస్తున్నారు. విద్యాశాఖకు సంబంధించిన ముఖ్యమైన ఫైళ్లు, ఉత్తర ప్రత్యుత్తరాలు, ధనరూపకాలు, పరీక్షా పత్రాలను నిర్ణీత సమయంలో సురక్షితంగా సంబంధిత అధికారులకు చేరవేయడంలో ఆయన చూపిన నిజాయితీ, బాధ్యతను ఉన్నతాధికారులు ప్రశంసించారు. సుదీర్ఘ సర్వీసులో ఒక్కరోజు కూడా సెలవు పెట్టకుండా, ఎలాంటి ఫిర్యాదు లేకుండా విధులు నిర్వర్తించడం, కార్యాలయ ఆస్తులను తన సొంత ఆస్తిలా కాపాడుకోవడం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని ఈ పురస్కారానికి ఎంపిక చేసారు “పెద్ద హోదాలో ఉన్నవారే కాదు, క్షేత్ర స్థాయిలో పనిచేసే ప్రతి ఒక్కరి సేవ విలువైనదని శ్రీను నిబద్ధత యువ సిబ్బందికి స్ఫూర్తి” అని ఉపాధ్యాయులు ప్రశంసిస్తున్నారు విద్యావనరుల కార్యాలయ పర్యవేక్షకులు మాట్లాడుతూ, “ఏ ఫైలు ఎక్కడ ఉందో, ఏ ఉత్తరం ఎవరికి వెళ్లాలో కరెక్టుగా గుర్తుపెట్టుకునేవారు. కార్యాలయానికి ఆయనే వెన్నెముక” అని కొనియాడారు.పురస్కారం అందుకున్న అనంతరం శ్రీను భావోద్వేగంతో మాట్లాడుతూ, “ఒక మెసెంజర్ గా చేసిన సేవను గుర్తించి ప్రభుత్వం ఇంత పెద్ద గౌరవం ఇస్తుందని అనుకోలేదు. ఇది నా కుటుంబానికి, నా కార్యాలయానికి దక్కిన గర్వకారణం. ఇంకా విధి నిర్వహణలో ఉన్నంతవరకు అదే నిబద్ధతతో పనిచేస్తాను” అని తెలిపారు.ఈ సందర్భంగా సహోద్యోగులు, ఉపాధ్యాయ సంఘాల నాయకులు శ్రీను ను అభినందించారు..