మర్రిపాడు.(ప్రభాకర్ మేకల //ఇదినిజం బ్యూరో ఇంచార్జ్ ):
ప్రధాని నరేంద్ర మోదీ 132వ మన్‌కీ బాత్ కార్యక్రమంలో బీజేవైఎం జిల్లా ఉపాధ్యక్షుడు నూనె హజరత్ యాదవ్ పాల్గొన్నారు. ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణ కలిగిన నాయకుడిగా మోదీజీ ఎదిగినప్పటికీ.. నెలకు ఓ గంట సేపు విభిన్న అంశాలను ప్రజల దృష్టికి తీసుకొచ్చారని అన్నారు.జాతి నిర్మాణంలో ప్రజలను భాగస్వాములను చేస్తూ.. చిన్న విషయాలు సైతం సమాజంలో పెద్ద మార్పు తీసుకొస్తుందనే విశ్వాసంతోనే ప్రధాని నరేంద్ర మోదీ ప్రతి నెలా మనసులో మాట కార్యక్రమాన్ని నిరాటంకంగా కొనసాగిస్తున్నారని బీజేవైఎం జిల్లా ఉపాధ్యక్షులు నూనె హజరత్ యాదవ్ తెలిపారు.
మర్రిపాడు సాంఘిక సంక్షేమ శాఖ బాలుర వసతి గృహంలో విద్యార్డులతో కలిసి ప్రధాని నరేంద్ర మోదీ 132వ మన్‌కీ బాత్ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు వంశిదర్ రెడ్డి, బీజేవైఎం జిల్లా అధ్యక్షులు చింతలపల్లి భరత్ రెడ్డి ఆదేశాల మేరకు బీజేవైఎం జిల్లా ఉపాధ్యక్షుడు నూనె హజరత్ యాదవ్ పాల్గొన్నారు. విద్యార్థులకు అవగాహన కల్పించారు. ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన నాయకునిగా నరేంద్రమోదీ అందరి దృష్టిని ఆకర్షించినా – తనకున్న సమయంలో నెలకు ఓ గంట సేపు విభిన్న అంశాలను ప్రజల దృష్టికి తీసుకొచ్చేందుకు వారిని ఆలోచింపజేసేందుకు చేస్తోన్న ప్రయత్నం స్ఫూర్తిదాయకమన్నారు.ఇలాంటివి జాతి నిర్మాణానికి ఎంతో ఉపయోగపడతాయని అన్నారు. ఓ వైపు అభ్యుదయం గురించి మాట్లాడుతూనే మన దేశ ఉత్కృష్టమైన సంస్కృతి, సంప్రదాయాలు, వారసత్వాన్ని ప్రపంచం ముందు ఉంచే ప్రయత్నం చేస్తున్నారన్నారు. అనేక కొత్త ఆవిష్కరణల గురించి ప్రజలకు వివరిస్తున్నారని అన్నారు. ప్రపంచంలోనే ఏ దేశంతోనూ మన యువత మేథోసంపత్తిలో తీసిపోరని చాటుతూ – యువతను జాగృతులను చేస్తున్నారని అన్నారు.
“ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణ కలిగిన నాయకుడిగా ఎదిగినప్పటికీ.. అనేక విషయాల మీద ఆయన మన్కీ బాత్ కార్యక్రమంలో ప్రస్తావించారు. ఒక వైపు స్పేస్ రీసెర్చ్ మీద మాట్లాడటం, లేదా కొత్త కొత్త టెక్నాలజీల మీద మాట్లాడటం, లేదా అధునాతనమైన వైద్య సౌకర్యాల గురించి మాట్లాడుతూ.. రెండో వైపు చిన్న చిన్న గ్రామాలలో ప్రజల జీవితాలలో మార్పులు తీసుకొచ్చిన విషయాలను కూడా ఆయన ప్రస్తావిస్తారు.
ప్రస్తుతం యుద్ధం జరుగుతున్న ప్రాంతం మన ఇంధన అవసరాలకు కేంద్రం. ఈ కారణంగా ప్రపంచవ్యాప్తంగా పెట్రోలు, డీజిల్ తదితర అవసరాలకు ఇబ్బంది ఏర్పడుతోంది. ప్రపంచవ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుండి అందుతోన్న సహకారం, గత దశాబ్ద కాలంగా దేశంలో పెరిగిన సామర్థ్యం కారణంగా భారతదేశం ఈ పరిస్థితులను ధైర్యంగా ఎదుర్కుంటోంది
ఇది సవాళ్ళతో కూడిన సమయం. మనమంతా సామూహిక శక్తితో ఈ సవాలును ఎదుర్కోవాలని మన్ కీ బాత్ మాధ్యమం ద్వారా దేశ ప్రజలందరినీ కోరుతున్నాను. ఈ విషయాన్ని ఎవరూ రాజకీయం చేయకూడదు. ఇది దేశంలోని 140 కోట్ల మంది ప్రజల ప్రయోజనాలకు సంబంధించిన విషయం. కాబట్టి ఇందులో రాజకీయానికి స్థానం లేదు. ఈ విషయంలో వదంతులు ప్రచారం చేసేవారు దేశానికి చాలా నష్టం కలిగిస్తున్నారు. ఈ పుకార్ల మాయలో పడవద్దని నేను దేశప్రజలందరినీ కోరుతున్నాను. ప్రభుత్వం ఎప్పటికప్పుడు అందజేస్తున్న సమాచారాన్ని విశ్వసించండి. ఆ సమాచారం ఆధారంగానే అడుగు ముందుకువేయండి. ప్రతిసారీ లాగానే ఈసారి కూడా నాకు విశ్వాసముంది. 140 కోట్ల మంది దేశ ప్రజలు సమర్థతతో, సామూహికంగా గతంలోని గడ్డు పరిస్థితులను ఎదుర్కొన్నట్టు గానే ఇప్పుడు కూడా సామూహిక కృషితో కఠిన పరిస్థితులను ధైర్యంగా ఎదుర్కొంటాం. క్షేమంగా బయటపడతాం అని ప్రధాని మోదీ జీ ప్రజలకు దైర్యం నింపడం స్ఫూర్తి దాయకం అని విశ్వశించారు కార్యక్రమం లో .బీజేపీ మండల అధ్యక్షులు బోగాలా మురళి రెడ్డి, బీజేవైఎం జిల్లా మాజీ కార్యదర్శి తిరుపతి నాయుడు, చీమలసిన్నీ రవీంద్ర తదితరులు పాల్గొన్నారు.