idhinijam.com
Newspaper Banner
Date of Publish : 16 June 2026, 9:17 pm Digital Edition : Idhi Nijam Desk

బస్సు ను నమ్ముకొని బడి పిల్లల అగచాట్లు…*

బస్సునునమ్ముకొనిబడిపిల్లలఅగచాట్లు

మర్రిపాడు.(ప్రభాకర్ మేకల,ఇదినిజంబ్యూరో ఇంచార్జ్):

మర్రిపాడు మండల పరిధిలోని పల్లెల్లో విద్యార్థులు బడి బస్సును నమ్ముకొని గత సంవత్సరం మండల కేంద్రంలో పాఠశాలలలో చేరి పాఠశాలలు పునః ప్రారంబించిన బడి బస్సు లేక బడికి వెళ్లలేక ప్రత్త్యామ్నాయం లేక ఆగచాట్లు పడుతున్నారని విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన చెందుతున్నారు .సర్కారు పాఠశాలలపై ప్రభుత్వం అలసత్వం ప్రదర్శిస్తోందని విచారం వ్యక్తం చేస్తున్నారు . మౌలిక వసతుల కల్పన దేవుడెరుగు.. విద్యార్థులకు ప్రధానమైన రవాణా సౌకర్యం కల్పించడంలో ఘోరంగా విఫలమవుతున్నదని తెలియజేస్తున్నారు . మర్రిపాడు లో చదువుకునేందుకు గ్రామాల నుంచి మండల కేంద్రాలు, పట్టణాలకు వెళ్లడానికి బస్సులు లేక విద్యార్థులు పడరానిపాట్లుపడుతున్నారు.ప్రధాన రహదారిపై ఉన్న గ్రామాలకు తప్ప మిగతా పడమటి నాయుడుపల్లి, చుంచులూరు కదిరి నాయుడుపల్లి కొత్తూరు, రాజుపాలెం, గంగపాలెం, ఇర్లపాడు, ఇస్కపల్లి మారుమూల పల్లెలకు పాఠశాలలు ప్రారంభమైనప్పటి నుంచి బస్సులు నడపడం లేద ని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. ఆయా రూట్లలో కూడా సమయానికి బస్సులు రాక.. వచ్చినా వి ద్యార్థులు, మహిళలను చూసి బస్సులు ఆపకుం డా వెళ్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ముఖ్యంగా మండల కేం ద్రంలోని జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల, నందవరం మోడల్ స్కూల్ కు మండలంలోని కదిరి నాయుడుపల్లి, పడమటి నాయుడు పల్లి, చుంచులూరు గంగపాలెం రాజుపాలెం గ్రామాల నుంచి దాదాపు సుమారు 60 పైనే విద్యార్థులు నిత్యం ప్రై వేట్‌ వాహనాలకు ఖర్చు చేయాల్సి వస్తుందని విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నా రు. ఇప్పటికైనా అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి మారుమూల గ్రామాల విద్యార్థుల కోసం బస్సులు నడిపించాలని వారు కోరుతున్నారు.