ప్రభుత్వ కళాశాలలో చదివి స్వయం కృషి తో ఐఐటీ ధార్వాడ లో సీటు సాధించిన…పోలంరెడ్డి ఈశ్వర్ రెడ్డి :
మట్టిని పిండి చేసి పిల్లలను ప్రయోజకులను చేసిన తల్లిదండ్రులు కోటేశ్వర రెడ్డి వజ్రమ్మ :
మర్రిపాడు.(ప్రభాకర్ మేకల //ఇదినిజం బ్యూరో ఇంచార్జ్ ):
సామాన్య రైతు కుటుంబంలో పుట్టి, అంచెలంచెలుగా ఎదిగి ఐఐటీ (IIT) లో సీటు సాధించడం నిజంగా గర్వకారణం. పడమటి నాయుడు పల్లి ప్రభుత్వ పాఠశాలలో విద్యాభ్యాసం ప్రారంభించి8,9,10 తరగతులు వరకు నందవరం మోడల్ స్కూల్ లో చదివి అనంతరం విశ్వసాయి విద్యాసంస్థలో ఇంటర్మీడియట్ పూర్తి చేసిపట్టుదలతో చదివి, కష్టాలను అధిగమించి నేడు విడుదలైన జోసా (JoSAA) తొలి విడత కౌన్సెలింగ్ ఫలితాల్లో గ్రామానికి చెందిన పోలం రెడ్డి ఈశ్వర్ రెడ్డి, ఐఐటీ దర్వాడ లో Mathematics and Computing శాఖలో సీటు సాధించి .ప్రతిభ చాటుకుంటున్నారు.ఇంటర్మీడియట్ అనంతరం ఒక సంవత్సరం పాటు ఇంటి వద్దే స్వయంగా సిద్ధమై జేఈఈ అడ్వాన్స్డ్‌లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన ఈశ్వర్ రెడ్డి, తన కృషి, పట్టుదలతో ఈ ఘనతను అందుకున్నాడు.*తల్లిదండ్రులు కోటేశ్వర రెడ్డి, వజ్రమ్మ దంపతుల ప్రోత్సాహం ప్రధాన కారణం…*మారుమూల పల్లెటూరులో పుట్టిన తల్లిదండ్రులు కోటేశ్వర రెడ్డి వజ్రమ్మ మట్టిని పిండి చేసి పిల్లలను ప్రయోజకులను చేయాలనే కళ నెరవేరింది. పల్లెటూరులో సామాన్య రైతు బిడ్డగా పుట్టి మట్టిని నమ్ముకొని బిడ్డలను ప్రయోజకులను చేయాలని నిత్యం సేద్యం చేస్తూ ఉన్నత చదువులు చదివించి ఇద్దరు మగ పిల్లలో పెద్ద కుమారుడు ఉమా మహేశ్వర రెడ్డి ఇప్పటికే చార్టర్డ్ అకౌంటెంట్ (CA)గా అర్హత సాధించి Deloitte సంస్థలో ఉద్యోగం చేస్తున్నారు.పల్లెటూరికే వన్నె తెచ్చారు.తన కృషి, పట్టుదలతో రెండవ కుమారుడు ఈశ్వర్ రెడ్డి, ఐఐటీ ధారవాడ్‌లో సీటు సాధించాడు ఈ విజయానికి తల్లిదండ్రులు కోటేశ్వర రెడ్డి, వజ్రమ్మ త్యాగాలు, ప్రోత్సాహం ప్రధాన కారణమని పలువురు అభినందిస్తున్నారు ఒక కుమారుడు CAగా ఉన్నత ఉద్యోగం , మరో కుమారుడు IITలో ప్రవేశం పొందడంతో ఆ కుటుంబంలో ఆనందం వెల్లివిరిసింది.గ్రామీణ నేపథ్యం నుంచి వచ్చిన ఈశ్వర్ రెడ్డి విజయం యువతకు స్ఫూర్తిదాయకంగా నిలిచిందని గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.