idhinijam.com
Newspaper Banner
Date of Publish : 27 June 2026, 9:13 pm Digital Edition : Idhi Nijam Desk

పోలియో రహిత సమాజ సాధన ప్రతి ఒక్కరు బాధ్యత….. ప్రజా వైద్యులు డా. గోపినాథ్.*

  • పోలియో రహిత సమాజ సాధన ప్రతి ఒక్కరు బాధ్యత….. ప్రజా వైద్యులు డా. గోపినాథ్.
  • మర్రిపాడు.(ప్రభాకర్ మేకల //ఇదినిజం బ్యూరో ఇంచార్జ్ ):

పోలియో రహిత సమాజ సాధన కోసం మండలంలో ప్రతి ఒక్కరు బాధ్యతగా వ్యవహరించాలని ప్రజా వైద్యులు, మండల మెడికల్ ఆఫీసర్ డా. గోపినాథ్. సూచించారు. మండల పరిధిలోని గ్రామాల్లో ఏర్పాటు చేసిన 27 బూతుల్లో పుట్టిన శిశువు నుండి ఐదేళ్ల లోపు వయస్సు ఉన్న ప్రతి చిన్నారికి జూన్ 28, 2026 (ఆదివారం) నేడు సమీపంలోని కేంద్రంలో పల్స్ పోలియో చుక్కలు తప్పనిసరిగా వేయించి ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.అంగన్వాడీ కేంద్రాలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ప్రభుత్వ ఆసుపత్రులు మరియు బస్టాఫ్‌లలో అందుబాటులో ఉంటాయని పిల్లలకు గతంలో సాధారణ వ్యాక్సిన్లు అన్నీ పూర్తయినప్పటికీ, ఈ ప్రత్యేక డ్రైవ్‌లో రెండు చుక్కలు వేయించడం ద్వారా అదనపు రక్షణ లభిస్తుందని మర్రిపాడు ప్రజా వైద్యులు, మండల మెడికల్ ఆఫీసర్ డా. గోపినాథ్. తెలియజేసారు.