idhinijam.com
Newspaper Banner
Date of Publish : 02 May 2026, 10:38 pm Digital Edition : Idhi Nijam Desk

పొంగూరుకండ్రిక లో కోదండరామస్వామి బ్రహ్మోత్సవ వేడుకలు…….

మర్రిపాడు.(ఇదినిజం ప్రతినిధి ):                          మర్రిపాడు మండలం పొంగూరు కండ్రిక సీతా సమేత కోదండరామస్వామి ఆలయంలో శనివారం బ్రహ్మోత్సవాలు వేడుకగాప్రారంభమయ్యాయి.స్వస్తి శ్రీ పరాభవ నామ సంవత్సర వైశాఖ మాస బహుళ పాడ్యమి శనివారము నుండి అనగాతేది 02.05.2026 నుండి తేది. 04.05.2026 సోమవారం వరకు త్రయాహ్నిక స్మార్త, వైష్ణవ, వైదిక ఆగమదీక్షా పురస్సరము మూడు రోజుల పాటు జరిగే ఈ వేడుకల్లో స్వామిని ప్రతిరోజు ప్రత్యేకవాహనంపై ఊరేగించనున్నారు. శనివారముఉదయం గణపతి పూజ, స్వస్తి వాచనము, స్వామి వార్లకు అభిషేకం చేశారు సాయంత్రము: గం.06.00 నుండి, అర్చనలు, మంగళహారతులు, గ్రామోత్సవము నిర్వహించి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.భక్తబృందం ఆధ్వర్యంలో సీతారాములకల్యాణం,వసంతోత్సవం,ప్రత్యేకపూజలునిర్వహించనున్నారు. ప్రజలందరూ బ్రహ్మోత్సవాల్లో పాల్గొని, తీర్థ ప్రసాదాలు స్వీకరించి స్వామి కృపకు పాత్రులు కావాలని కోరారు. భక్తులు ప్రసాదాలు స్వీకరించి, స్వామి ఆశీస్సులుపొందాలనిఆకాంక్షించారునేడుఆదివారముఉదయం ప్రాతఃకాల పూజ, పారాయణం, రాత్రి 08.00 ని నుండి శ్రీ సీతా రాముల కళ్యాణము,మంగళ హారతి తీర్ధ ప్రసాదములు వితరణ రాత్రిసాంస్కృతికకార్యక్రమములు, మంగళహారతులు, గ్రామోత్సవము నిర్వహిస్తారు సోమవారముఉదయం ప్రాతఃకాల పూజ, ఉట్టి కొట్టుట వసంతం గ్రామోత్సవం సాయంత్రం పారువేట మహోత్సవము అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు పై దైవ కార్యక్రమములలో పాల్గొని శ్రీ సీతా, లక్ష్మణ, హనుమత్ సమేత శ్రీ కోదండ రామచంద్ర స్వామి వార్ల కృపకు ప్రతిఒక్కరు పాత్రులగుదురని పొంగూరు కండ్రిక గ్రామ పెద్దలు మరియు ఉత్సవ కమిటీ సభ్యులు కోరుతున్నారు.