idhinijam.com
Newspaper Banner
Date of Publish : 13 June 2026, 9:09 pm Digital Edition : Idhi Nijam Desk

పేకాట రాయుళ్లు అరెస్ట్

పేకాట రాయుళ్లు అరెస్ట్.                                                   ఏ ఎస్ పేట ( ఇది నిజం ప్రతినిధి హరికృష్ణ ) మండల కేంద్రమైన ఏఎస్పేటలో సాయంత్రం సుమారు 6.00 గంటల సమయంలో, ఏఎస్‌పేట గ్రామ శివారు ప్రాంతంలోని పంటచేల వద్ద కొందరు వ్యక్తులు పేకాట ఆడుతున్నట్లు విశ్వసనీయ సమాచారం అందింది. అందిన సమాచారం మేరకు ఏఎస్‌పేట ఎస్సై జిలాని తన పోలీస్ సిబ్బందితో కలిసి ఆకస్మికంగా దాడి (రైడ్) నిర్వహించగా, అక్కడ పేకాట ఆడుతున్న ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకోవడం జరిగింది.వారి వద్ద నుండి పేకాట నిర్వహణకు ఉపయోగించిన సామగ్రితో పాటు రూ.2,640/- నగదు స్వాధీనం (సీజ్) చేసుకోవడం జరిగింది. ఈ ఘటనకు సంబంధించి చట్టపరమైన చర్యలు చేపట్టబడినవి.ఏఎస్‌పేట మండల పరిధిలో పేకాట, జూదం, అసాంఘిక కార్యకలాపాలు మరియు ఇతర చట్టవిరుద్ధ కార్యక్రమాలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని ప్రజలకు తెలియజేయడమైనది. ప్రజలు తమ పరిసర ప్రాంతాల్లో జరుగుతున్న ఇటువంటి చట్టవిరుద్ధ కార్యకలాపాల గురించి నిర్భయంగా పోలీసులకు సమాచారం అందించాలని కోరుచున్నాము అని ఆయన తెలిపారు అందిన ప్రతి సమాచారంపై వెంటనే స్పందించి, రైడ్‌లు నిర్వహించి, చట్టప్రకారం తగిన చర్యలు తీసుకుంటాము ఆయన ప్రజలకు తెలిపారు