idhinijam.com
Newspaper Banner
Date of Publish : 13 May 2026, 6:50 am Digital Edition : Idhi Nijam Desk

పశువులను రోడ్లపైకి వదిలితే చర్యలు తప్పవు..

మండల ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ అనిల్ కుమార్ యాదవ్, సబ్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ రావు.

మర్రిపాడు.(ఇదినిజం ప్రతినిధి )

మర్రిపాడు మండల పరిధిలోని జాతీయ రహదారి ఫై మరియు వీధులలో ఇష్టానుసారంగా పశువులను విచ్చలవిడిగా రోడ్లపైకి వదిలి వేయుట కారణంగా పారిశుధ్య నిర్వహణకు మరియు ప్రజల, వాహనముల రాకపోకలకు తీవ్ర అవరోధం కలుగుతు రోడ్డు ప్రమాదలకు గురై మనిషి ప్రాణాలు పోతున్న దృశ్య రోడ్లపైకి విచ్చలవిడిగా పశువులను వదులుతున్న యజమానులపై కఠిన చర్యలు తీసుకుంటామని స్థానిక మండల ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ అనిల్ కుమార్ యాదవ్, సబ్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ రావు ఒక ప్రకటన లో తెలిపారు. మంగళవారం ఆత్మకూరు ఆర్డీఓ కార్యాలయం లో సబ్ డివిజినల్ పోలీస్ ఆఫీసర్ వారి అధ్యక్షతన పసుసంవర్ధక శాఖ, పోలీసు శాఖ, రెవిన్యూ శాఖా అటవీ శాఖా & జాతీయరహదారుల ప్రతినిధులు సమక్షములో జాతీయ రహదారుల పై సాదు జంతువుల ( గేదేల, ఆవులు మరియు

ఇతరములు) సంచారము వలన ఇటీవల అనేక రోడ్డు ప్రమాదములు సంభవించి ప్రాణ నష్టం జరిగినందున ప్రజల ప్రాణ భద్రతను దృష్టిలో ఉంచుకొని రోడ్లపై జంతువుల సంచారమును నిలువరించుటకు పశువుల యజమానులపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు.జాతీయ రహదారులపై పశువులు నిర్బంధం లేకుండా సంచరిస్తుండటం తీవ్ర ప్రమాదాలకు దారి తీస్తోందని రహదారులపై అకస్మాత్తుగా పశువులు రావడం వల్ల వాహనదారులు నియంత్రణ కోల్పోయి ప్రమాదాలకు గురవుతున్నారని ఈ ప్రమాదాల్లో కేవలం మనుషులు మాత్రమే కాదు, మూగజీవాలు కూడా ప్రాణాలు కోల్పోతున్నాయని ఆవేదన వ్యక్తం చేసారు.వాహన చోదకులు & ప్రయాణికులు ప్రాణముల కోల్పోవడం తో పాటు వారి కుటుంబాలు వీధిన పడికడు దుర్భర జీవితమును అనుభవించుచున్నారు కనుక ప్రజల ప్రాణ భద్రతను దృష్టిలో ఉంచుకొని ప్రతియజమాని తమ పశువులను నియంత్రణలో ఉంచి, రహదారులపైకి రానీయకుండా ముఖ్యముగా రాత్రి వేళలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు.ఇకపై జాతీయ రహదారులపై పశువులు వదిలివేసినట్లు గుర్తించిన సదరు యజమానులపై సంబంధితచట్టాల ప్రకారం చర్యలు తీసుకుంటామని . ప్రభుత్వ అధికారులు సూచించె అంశములపై మీ వంతు సహకారమును అందించాలని తెలిపారు పైన తెలిపిన సూచనలు పాటించని వారిపై తీసుకొను చట్టపరమైన చర్యలకు పశువులు యజమానులు భాద్యులని ప్రజా భద్రత దృష్ట్యా ప్రతి ఒక్కరూ సహకరించాలని మండల ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ అనిల్ కుమార్ యాదవ్, సబ్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ రావు విజ్ఞప్తి చేస్తున్నారు.పశువుల నియంత్రణపై కఠిన నిర్ణయాలు తీసుకుంటే ప్రమాదాల సంఖ్య తగ్గే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు.