idhinijam.com
Newspaper Banner
Date of Publish : 09 August 2026, 7:37 am Digital Edition : Idhi Nijam Desk

పరిపాలన అమలుపై మర్రిపాడు గ్రామాల్లో మిశ్రమ స్పందన…???*

*పరిపాలన అమలుపై మర్రిపాడు గ్రామాల్లో మిశ్రమ స్పందన…???* *ప్రజల అసలు సమస్యలే స్థానిక ఎన్నికలకు కీలకం..!* *గ్రామ ప్రజల అనుభవాలే స్థానిక ఎన్నికలపై ప్రభావం చూపే అవకాశం…..???* *మర్రిపాడు.(ప్రభాకర్ మేకల //ఇదినిజం బ్యూరో ఇంచార్జ్ ):*

స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నద్ధం కావాలని మంత్రులకు విద్యా, ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ పిలుపునిచ్చారు. స్థానిక సంస్థలు ఎన్నికల వాతావరణం క్రమంగా వేడెక్కుతున్న నేపథ్యంలో ప్రభుత్వ పథకాల అమలు,మర్రిపాడులో ప్రజలకు అందుతున్న అధికార పార్టీ పాలన విధానం ప్రధాన చర్చనీయంశంగా మారుతోంది. ప్రభుత్వాలు మారినా ప్రజల ప్రధాన సమస్యలు మాత్రంఅలాగే ఉంటున్నాయని సంక్షేమ పథకాలు లబ్దిదారులకు చేరలేదని మండల ప్రజలు అక్షేపిస్తున్నట్లు బహిరంగరహస్యంగాప్రజలుతలపోసుకుంటున్నారు.క్షేత్రస్థాయిలో ప్రభుత్వ పనితీరుపై ప్రజల అవసరాలు పట్టించు కొనే అధికార పార్టీ నాయకులు కరువయ్యారని మర్రిపాడు మండల పరిధిలోని గ్రామాల్లో చర్చకు వస్తున్నాయి.ప్రజలు రోజువారీ జీవితాలను ప్రభావితం చేసే అంశాలపైనే ఓటర్ల నిర్ణయం ఆధారపడుతుందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. పథకాలపై ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు తమకు ఉపయోగపడుతున్నాయని కొంతమంది లబ్ధిదారులు చెబుతుండగా,మరికొందరు అర్హత ఉన్నప్పటికీ తమకు ప్రయోజనం అందడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత మూడు సంవత్సరాలుగా సామాజిక పింఛన్లు సైతం అందక పేదరికంలో ఉన్న వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు మరియు ఇతర బలహీన వర్గాల వారికి ప్రభుత్వాలు ఆర్థిక భద్రత కల్పించడానికి సామాజిక పింఛన్లు అందక 60ఏండ్లు దాటినవృద్ధులు అర్హత కలిగిన లబ్ధిదారులు ఆవేదనతో ఎదురు చూస్తున్నారు.తల్లికి వందనం పథకంలో ప్రతి పిల్లవాడికి పదమూడు వేల రూపాయలు వస్తుంది అనేది పేపర్లకే సరిపోలుతుందని క్షేత్రస్థాయిలో పరిశీలిస్తే సగానికి పైగా పదివేల లోపే తల్లికి వందనం అందిందని విద్యార్థుల తల్లులు నిరాశతో నిట్టూర్పులు విడుస్తున్నారు అర్హుల గుర్తింపు,దరఖాస్తుల పరిశీలన, స్థానిక స్థాయిలో అధికారుల స్పందన వంటిఅంశాలు ప్రజల సంతృప్తిని ప్రభావితం చేస్తున్నాయనేది విశ్లేషకుల అభిప్రాయం. మండల పరిధిలో రోడ్లు, తాగునీరు, పారిశుధ్యం వంటి ప్రాథమికసమస్యలను పరిష్కరించడంలో స్థానిక పాలన కీలకమని, ఎన్నికల్లో ఇవే అంశాలు ప్రధానంగా మారుతాయని మర్రిపాడు మండల పరిధిలో, స్థానిక కేంద్రం లో ఇవి అందడంలో వెనుక పడినట్లు ప్రజలు అభిప్రాయపడుతున్నారు. కనీసం మండల పరిధిలో సరిహద్దు ప్రాంతాల్లో ఉండే గ్రామాల్లో ఆర్టీసి బస్సులు ఆపలేదన్న ప్రయాణికుల గోడు నాయకులు పట్టించుకోవడం లేదనే వాదనలు వినిపిస్తున్నాయి అభివృద్ధి, సంక్షేమం రెండింటికీ ప్రాధాన్యం ఇస్తూ పథకాలనుఅమలు చేస్తున్నామని ప్రభుత్వం చెబుతోంది. అర్హులందరికీ ప్రయోజనాలు అందేలా చర్యలు తీసుకుంటున్నామని, గతంతోపోలిస్తే పరిపాలనలో పారదర్శకత పెరిగిందని అధికార వర్గాలు వివరిస్తున్నాయి.స్థానిక సంస్థల్లో మెజారిటీ స్థానాలను కూటమి అభ్యర్థులు కైవసం చేసుకోవాలని .ఈ ఎన్నికలు అనుకున్న సమయానికే జరుగుతాయని నారా లోకేశ్ స్పష్టం చేశారు.ప్రతి ఇంటి వద్దా కనీసం 3 నిమిషాలైనా ఉండి వివరించాలంటూ మంత్రులకు దిశానిర్దేశం చేశారు.కాని స్థానిక ఎన్నికల్లో కేవలం పెద్ద రాజకీయ అంశాలకంటే ప్రజల రోజువారీ సమస్యలే ప్రభావం చూపే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు.గ్రామాల్లో తాగునీరు,వీధి రహదారులు, పారిశుధ్యం, దీపాలు, ఉపాధి అవకాశాలు, పట్టణాల్లో, ట్రాఫిక్ సమస్యలు,డైనేజీ వ్యవస్థ, మౌలిక వసతులు, పన్నులు, సేవల నాణ్యత వంటి అంశాలు ఓటర్ల నిర్ణయాన్ని ప్రభావితం చేసే అవకాశముంది.ప్రజల తీర్పు కేవలం పథకాలపైనే కాకుండా స్థానిక నాయకులుపనితీరు, అందుబాటు, సమస్యల పరిష్కార వేగం వంటి అంశాలపై కూడా ఆధారపడుతుందని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.