idhinijam.com
Newspaper Banner
Date of Publish : 13 May 2026, 9:32 pm Digital Edition : Idhi Nijam Desk

పది ఫలితాల్లో కేజీబీవీ కేక…..

పది ఫలితలలో జిల్లాలో ఉండే 12 కేజీబివి పాఠశాలలో అగ్రస్థానం లో మర్రిపాడు

కేజీబివి……ప్రధమ, ద్వితీయ, తృతీయ స్థానాలు మర్రిపాడు కె…

ప్రశంసించిన ఏపీసీ (అడిషనల్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ ):

మర్రిపాడు.(ఇదినిజం ప్రతినిధి ):

మర్రిపాడు కేజీబీవీ విద్యార్థునిల అద్భుత ప్రతిభతో ప్రభుత్వ విద్యారంగానికి, ముఖ్యంగా 2025-26 విద్యాసంవత్సరానికి బాలికా విద్యకు మంచి గుర్తింపు లభించింది కేజీబీవీల పనితీరు గత ఏడాదితో పోలిస్తే గణనీయంగా మెరుగుపడి జిల్లాలో ఉండే 12 పాఠశాలలో మర్రిపాడు కేజీబివి విద్యార్థినిలు పదవ తరగతిలో -టి .మస్తానమ్మ 584/600, పి .మహిత 581/600, ఎం .మేరీ 579/600 అగ్రస్థానాల దిశగా దూసుకువెళ్లి జిల్లాలోనే ప్రధమ ద్వితీయ, తృతీయ స్థానాలనుకైవసం చేసుకొని నెల్లూరు జిల్లా సమగ్ర శిక్ష కార్యాలయం లో బుధవారం జరిగిన కార్యక్రమం లో . ఏపీసీ (అడిషనల్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ )చేతులు మీదుగా ప్రశంస పత్రం, అవార్డు అందుకున్నారు ఈ కార్యక్రమంలో కేజీబివి పాఠశాల ప్రిన్సిపాల్ లక్ష్మిదేవి విద్యార్థులు పట్ల చూపిన ప్రత్యేక శ్రద్దను కొనియాడారు.పదో తరగతి (SSC) మరియు ఇంటర్మీడియట్ ఫలితాలలో కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాలు (KGBV) అద్భుతమైన ప్రతిభ కనబరిచి ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా నిలిచి జిల్లాల్లో మర్రిపాడు కేజీబీవీ విద్యార్థులు అత్యధిక మార్కులు సాధించి టాపర్లుగా నిలవడం పట్ల విద్యార్థినిల తల్లిదండ్రులు అనందం వ్యక్తం చేస్తున్నారు.కేజీబీవీ విద్యార్థులు జిల్లా స్థాయిలో అత్యుత్తమ మార్కులు సాధించి డిస్ట్రిక్ట్ టాపర్లుగా నిలిచి ఏపీసీ (అడిషనల్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ )చేతులు మీదుగా అవార్డులు పొందడంపై ప్రిన్సిపాల్ లక్ష్మి దేవి, పాఠశాల టీచర్లు సంతోషం వ్యక్తం చేశారు.