*పందిపాడు ఎస్సీ కాలనీలో నీటి కష్టాలు**సమస్య పరిష్కరించని అధికారులు*
ఏఎస్పేట (ఇది నిజం ప్రతినిధి హరికృష్ణ) ఏ ఎస్ పేట మండలంలోని పందిపాడు గ్రామం లో గడిచిన నాలుగు రోజుల నుంచి కరెంటు లేక మోటర్లు ఆడక నీళ్లు లేక నిత్య అవసరాలు కూడా నీళ్లు లేక నాన నాన అవస్థలు పడుతున్నామని పందిపాడు ఎస్సీ కాలనీ ప్రజలు పత్రికా ముఖంగా వారి ఆవేదన తెలియజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత నాలుగు రోజుల నుంచి పందిపాడు గ్రామం ఎస్సీ కాలనీలో నీళ్లు లేక నాన నాన బాధలు పడుతున్నామని కనీస అవసరాలు కూడా వాడుకునే దానికి కూడా నీళ్లు లేవని వారి ప్రాంతంలో చేతి బోర్లు కూడా చెడిపోయి ఉన్నాయని మూడు ఫేసుల కరెంటు లేక మోటార్లు ఆడక నీటి కొళాయిలకు వచ్చే నీరు రావడంలేదని వీధి లేక గత్యంతరం లేక ఏఎస్ పేట నుండి ట్రాక్టర్ ట్యాంకు ద్వారా 500 డబ్బులు ఒక ట్యాంకు ఇచ్చి నీళ్లు కొనుక్కుని తెప్పించుకుని వాడుకునే పరిస్థితి మాకు దాపురించిందని దౌర్భాగ్య పరిస్థితుల్లో మా గ్రామం ఉందని దళిత ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఈ కరెంటు సమస్య తీర్చమని అధికారులకు విన్నవించుకున్న విద్యుత్ సమస్య తీర్చలేదని విద్యుత్ సరఫరా లేని కారణంగా మోటర్లు ఆడక నీటి సరఫరా కావడం లేదని అధికారులకు ఎన్నిసార్లు తెలిపిన కరెంట్ సమస్య పరిష్కారం కాలేదని నీటి సమస్య తీరిక అనేక ఇబ్బందులు పడుతున్నామని కాలనీవాసులు తెలియజేశారు ఇప్పటికైనా అధికారులు స్పందించి తగు చర్యలు తీసుకొని కరెంటు సమస్య తీర్చాలని పందిపాడు ఎస్సీ కాలనీకి నీటి సౌకర్యం కల్పించాలని మోటార్లు పనిచేసే విధంగా కరెంటు అందేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఎస్సీ కాలనీ ప్రజలు వేడుకుంటున్నారు గత నాలుగు రోజుల నుంచి ఎస్సీ కాలనీ వాసులు ఇలా ఒక ట్యాంకర్ కి 500 లెక్కన డబ్బులు పెట్టి నీళ్లు కొనుక్కొని వాడుకుంటూ ఇబ్బంది పడుతున్నారు దళిత ప్రజలు అధికారులకు సమస్య తెలిపిన కరెంటు సమస్య పరిష్కారం కాక ఇప్పటికీ ఇబ్బందులు పడుతున్న ఎస్సీ కాలనీ వాసులు ఇప్పటికైనా అధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలని పందిపాడు ఎస్సీ కాలనీకి నీటి సౌకర్యం కల్పించాలని మోటర్లు ఆడే విధంగా పనిచేసే విధంగా కరెంటు అందేలా ఏర్పాటు చేయాలని కరెంట్ సమస్య తీర్చాలని అలాగే నీటి సమస్య కూడా తీర్చాలని కాలనీ ప్రజలు తమ గోడు వెల్లబోసుకుంటున్నారు