idhinijam.com
Newspaper Banner
Date of Publish : 07 July 2026, 6:14 am Digital Edition : Idhi Nijam Desk

నేడు రేపు (సర్) మెగా డ్రైవ్..!!!

నేడు రేపు (సర్) మెగా డ్రైవ్..!!!

మర్రిపాడు మండల పరిధిలోని అన్ని గ్రామాల్లో ఎన్యూమరేషన్ ఫారాల డిజిటైజేషన్ ఫై ప్రత్యేక దృష్టి…

ఓటర్ల హెల్ప్ డెస్క్లల సద్వినియోగానికి విస్తృత అవగాహన…

క్షేత్రస్థాయిలో వేగవంతమైన చర్యలకు తహసీల్దార్ అనిల్ కుమార్ యాదవ్ ఏర్పాటు….

మర్రిపాడు.(ఇదినిజం ప్రతినిధి ):ఓటర్ల జాబితా సమగ్ర సర్వే(ఎస్ఐఆర్) ప్రక్రియను మరింత వేగవంతంగా, సమర్థవంతంగాపూర్తిచేసేందుకు ఈ నెల 7, 8 వ తేదీన మండల వ్యాప్తంగా ప్రత్యేక మెగా డ్రైవ్ నిర్వహించనున్నట్లు స్థానిక మండల ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ అనిల్ కుమార్ యాదవ్ ఒక ప్రకటనలో తెలియజేశారు  ఈ మేరకు నేడు మరియు రేపు , ప్రత్యేక అధికారులు సాయంత్రం 5గం నుండి 10గం వరకు మెగా డ్రైవ్ సందర్భంగా క్షేత్రస్థాయిలో అందిన ఎన్యూమరేషన్ ఫారాలను ఎలాంటి జాప్యం లేకుండా డిజిటైజ్ చేయడంపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. ప్రతి పోలింగ్ కేంద్రం పరిధిలో ఫారాల స్వీకరణ, నమోదు, డిజిటైజేషన్ ప్రక్రియను నిరంతరం ఎప్పటికప్పుడు పురోగతిని తహసీల్దార్ పర్యవేక్షిస్తారు. ఓటర్లకు అందుబాటులో ఏర్పాటు చేసిన హెల్ప్ డెస్క్ సేవలను గ్రామస్తులు వినియోగించుకోవాలని నింపిన ఫారాలు ఒక ఫోటోతో బీఎల్ వోలకు అందించాలని ఓటర్లకు అవసరమైన సహాయ సహకారాలు ప్రత్యేక అధికారులు,అందిస్తారని మధ్యవర్తులతో అవసరం లేదని తహసీల్దార్ తెలిపారు . ప్రత్యేక అధికారులు, బీఎల్వీలు పరస్పర సమన్వయంతో పనిచేస్తూ కార్యక్రమాన్ని విజయవంతంగా ముందుకు తీసుకెళ్లేందుకు కృషిచేయాలని తహసీల్దార్ అనిల్ కుమార్ యాదవ్ ఒక ప్రకటనలో తెలియజేసారు.