*నెల్లూరు మేయర్ బరిలో విద్యావంతురాలు.. స్వతంత్ర అభ్యర్థిగా జయశ్రీ నామినేషన్* నెల్లూరు (ఇదినిజం ప్రతినిధి ): నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ పీఠానికి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ రసవత్తరంగా మారింది.నగర పాలక సంస్థ కార్యాలయంలో శనివారం ఉదయం ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ పరిరక్షణ కమిటీ జిల్లా మహిళా అధ్యక్షురాలు, ఎంబీఏ విద్యావంతురాలు ఎన్. జయశ్రీ తన నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారి మొగిలి వెంకటేశ్వర్లుకు అందజేశారు.స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగిన ఆమెకు కమిటీ రాష్ట్ర అధ్యక్షులు కొప్పాల రఘు, శ్రీనివాసరెడ్డి తదితరులు మద్దతుగా నిలిచారు.ఈ సందర్భంగా జయశ్రీ మాట్లాడుతూ.. విద్యావంతురాలిగా నగర అభివృద్ధి, మహిళా సాధికారత, అణగారిన వర్గాల సంక్షేమమే లక్ష్యంగా పోటీ చేస్తున్నానని తెలిపారు.