నెల్లూరులో పీఓఏ చట్టంపై వర్క్ షాప్ అవగాహన సదస్సు…ముఖ్య అతిధి గా హాజరైన డిఎస్పి జి. శ్రీనివాసులు… నెల్లూరు (ఇదినిజం ప్రతినిది ):
నెల్లూరులోని బట్వాడిపాలెం S.S.గ్రాండ్ హోటల్ వేదికగా ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో ‘షెడ్యూల్డ్ కులాలు, తెగల అత్యాచారాల నిరోధక చట్టం – 1989’ పై అవగాహన వర్క్‌షాప్ శుక్రవారం ఘనంగా జరిగింది. నెల్లూరు నగర కమిటీ అధ్యక్షురాలు సిహెచ్ నాగమణి నేతృత్వంలో మహిళా బృందం ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ మేరకు ముఖ్య అతిథిగా హాజరైన నెల్లూరు రూరల్ డీఎస్పీ జి. శ్రీనివాసులు మాట్లాడుతూ పీఓఏ యాక్ట్ మరియు పీసీఆర్ యాక్ట్ లక్ష్యాలను వివరించారు. అనంతరం వివిధ రంగాల్లో సేవలందించిన వారికి బెస్ట్ సర్వీస్ అవార్డు గ్రహీతలుగా ఎంపిక చేసి ఆ సంస్థ రాష్ట్ర అధ్యక్షులు కొప్పాల రఘు ప్రదానోత్సవం చేయడం జరిగింది.చట్టం ఆయుధం, అజ్ఞానం శత్రువు చట్టం తెలిసినవారికి అది రక్షణ కవచం. తెలియనివారికి అన్యాయం కొనసాగుతుంది” అని డీఎస్పీ పేర్కొన్నారు. ఎస్సీ, ఎస్టీలపై జరిగే కుల వివక్ష, భూ ఆక్రమణలు, బెదిరింపులు, బహిరంగంగా అవమానించడం, మహిళలపై వేధింపులు వంటి 37 రకాల నేరాలను పీఓఏ చట్టం గుర్తిస్తుందని వివరించారు. నేరం రుజువైతే 6 నెలల నుండి యావజ్జీవం వరకు శిక్ష, జరిమానా విధించే అవకాశం ఉందన్నారు.మహిళల భద్రతకు ప్రాధాన్యం మహిళలపై జరిగే లైంగిక వేధింపులు, దాడులు పీఓఏ చట్టం కింద తీవ్రమైన నేరాలని స్పష్టం చేశారు. బాధితులకు వెంటనే ఎఫ్ఐఆర్ నమోదు చేయడం, 60 రోజుల్లో ఛార్జ్‌షీట్ దాఖలు చేయడం, ప్రత్యేక కోర్టుల ద్వారా సత్వర న్యాయం అందించడం ఈ చట్టం ప్రత్యేకత అని తెలిపారు. బాధిత మహిళలకు ప్రయాణ ఖర్చులు, వైద్య ఖర్చులు, పునరావాసం కోసం ప్రభుత్వం ఆర్థిక సహాయం అందిస్తుందని గుర్తు చేశారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న వివిధ దళిత నేతలు, ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ పరిరక్షణ కమిటీ నాయకులు, మహిళా నేతలు పాల్గొన్నారు.