📰 Generate e-Paper Clip

*జాతీయ రహదారి(67)పై ప్రమాద ప్రాంతాలను పరిశీలించిన…డీఎస్పీ*

*మర్రిపాడు.(👉ప్రభాకర్ మేకల /✍️/ఇదినిజం బ్యూరో ఇంచార్జ్✍️ ):*

నెల్లూరు – ముంబై జాతీయ రహదారి(67) ప్రమాదాల నివారణలో భాగంగా ఆత్మకూరు సబ్‌ డివిజన్‌ పరిధిలోని పోలీస్‌ స్టేషన్ల సమీపంలో పలు బ్లాక్‌ స్పాట్‌ ప్రదేశాలను డీఎస్పీ వేణుగోపాల్ పరిశీలించారు.సర్కిల్ ఇన్స్పెక్టర్ గంగాధర్ రావు, ఆధ్వర్యంలో మర్రిపాడు సబ్ ఇన్స్పెక్టర్ కాసుల శ్రీనివాస్ రావు, ఆత్మకూరు ఎస్ఐ జిలాని పోలీస్ సిబ్బంది కార్యక్రమం లో పాల్గొన్నారు .బ్లాక్‌ స్పాట్ల ప్రాంతాలైన నెల్లూరు పాలెం, డి. సి పల్లి, నందవరం కూడలి, మర్రిపాడు అచ్చమాంబ తదితర ప్రాంతాలలో డిఎస్పీ పర్యటించారు జాతీయ రహదారిపై డ్రోన్లు ఆపరేట్‌ చేసి ప్రమాదాలకు కారణాలను గుర్తించారు రోడ్డు ప్రమాదాలు నియంత్రించాలంటే ఎలాంటి పరిష్కారాలు, ముందస్తు జాగ్రత్తలపై పలు సూచనలు చేశారు. సైన్ బోర్డులు, స్పీడ్‌ బ్రేకర్లు, క్యాట్‌ ఐస్‌, లైటింగ్‌, రంబబుల్‌ స్ర్టిప్స్‌ ఏర్పాటుఫై డిఎస్పీ సంతృప్తి వ్యక్తం చెసారు.మర్రిపాడు పోలీస్ స్టేషన్ ను సందర్శించి జాతీయ రహదారి ఫై ఏర్పాటు చేసిన ప్రమాద నివారణ లో వేగ నియంత్రణ కు ఏర్పాటు చేసిన ఇసుక డ్రమ్ములు చూసి సంతృప్తి వ్యక్తం చెసారు. ఈ కార్యక్రమం లో సర్కిల్ ఇన్స్పెక్టర్ గంగాధర్ రావు, మర్రిపాడు సబ్ ఇన్స్పెక్టర్ కాసుల శ్రీనివాస్ రావు, ఆత్మకూరు ఎస్ఐ జిలాని పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Leave a reply

Please enter your comment!
Please enter your name here