idhinijam.com
Newspaper Banner
Date of Publish : 28 July 2026, 9:11 am Digital Edition : Idhi Nijam Desk

జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సైన్స్ బస్సుయాత్ర…..

జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సైన్స్ బస్సుయాత్ర…..మర్రిపాడు (ఇదినిజం ప్రతినిధి ):

నెల్లూరు జిల్లా విద్యాశాఖ పర్యవేక్షణలో డాక్టర్ జి విజయ్ కుమార్ మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సైన్స్ బస్సుయాత్ర  27 తేదీ మర్రిపాడు మండలం మర్రిపాడు జడ్పీ హైస్కూల్ నందు హెడ్మాస్టర్ పద్మజ జన విజ్ఞాన వేదిక నాయకులు వేము పెంచలయ్య కె పోలయ్య జెండా ఊపి బస్సును ప్రారంభించారు. కార్యక్రమంలో జెవివి నాయకులు రసూలు వేణు సుబ్బరాయుడు పాఠశాల ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు బస్సు ఇన్చార్జి చక్రపాణి 40 మంది విద్యార్థులు పాల్గొన్నారు. జనవిజ్ఞాన వేదిక నిర్వహించు సివి రామన్ సైన్స్ సెంటర్ మరియు చెమట గుంటలో జిల్లా సైన్స్ సెంటర్,పురావస్తు శాఖ మ్యూజియం లను విద్యార్థులు సందర్శించారు. సైన్స్ పట్ల ఆసక్తిని పెంచుకునేందుకు ఈ కార్యక్రమాన్ని డాక్టర్ జి వి కే ఆశయ సాధన కోసం సైన్స్ భావాలను విద్యార్థుల్లో పెంపొందించడానికి డాక్టర్ జీవీకే మెమోరియల్ ట్రస్ట్ జనవిజ్ఞాన వేదిక సహకారంతో జిల్లావ్యాప్తంగా అన్ని గవర్నమెంట్ పాఠశాలలో నిర్వహిస్తుంది.