చికెన్ వ్యర్థాల మాఫియా కు చుక్కలు చూపిస్తున్న ఎస్సై బలరాంరెడ్డి…..
మర్రిపాడు.(ప్రభాకర్ మేకల //ఇదినిజం బ్యూరో ఇంచార్జ్ ):
ప్రజారోగ్యానికి తీవ్ర హాని కలిగించే అంతర్-రాష్ట్ర మాఫియా చికెన్ వ్యర్థాల అక్రమ రవాణా వాహనాలకు మర్రిపాడు ఎస్సై బలరాంరెడ్డి చుక్కలు చూపిస్తున్నాడు. అంతర జిల్లా సరిహద్దు ప్రాంతమైన మర్రిపాడు మండలంలో అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేస్తూ ప్రత్యేక నిఘా తో నమ్మకమైన సమాచారం తో చికెన్ వ్యర్థాల వాహనం పట్టి కేసు నమోదు చేస్తున్నారు.సోమవారం తెల్లవారుజామున నెల్లూరు ముంబై జాతీయరహదారి ఫై చుంచులూరు సమీపంలో అక్రమంగా తరలిస్తున్న AP39 VD 4703 నెంబర్ చికెన్ వ్యర్థాల గల బోలెరో వాహనాన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తనిఖీల సందర్భంగా వాహనంలో12 డ్రమ్ములలోచికెన్వ్యర్థాలుఉన్నట్లుగుర్తించారు.ప్రజారోగ్యానికి హానికరంగా మారే అవకాశం ఉండటంతో, అధికారుల పర్యవేక్షణలో ఆ వ్యర్థాలను సమీప కొండ ప్రాంతంలో పూడ్చిపెట్టారు.అనంతరం అక్రమ రవాణాకు పాల్పడిన వాహనంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.పర్యావరణానికి హాని కలిగించే విధంగా వ్యర్థాలను అక్రమంగా తరలించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్సై బలరాంరెడ్డి తెలిపారు గతంలో బ్రహ్మణపల్లి టోల్‌ప్లాజా వద్ద అనుమతులు లేకుండా చికెన్ వ్యర్థాలను అక్రమంగా తరలిస్తున్న బొలెరో వాహనాన్ని పట్టుకుని స్వాధీనం చేసుకోవడంగమనార్హం చికెన్ వ్యాపారులు, ప్రజలు ఎవరైనా ఇటువంటి అక్రమ నిల్వలు, వ్యర్థాల తరలింపులను గమనిస్తే వెంటనే అధికారులకు సమాచారం అందించి ప్రజారోగ్య సంరక్షణలో భాగస్వాములు కావాలని ఎస్సై బలరాంరెడ్డి కోరారు.