idhinijam.com
Newspaper Banner
Date of Publish : 13 March 2026, 1:57 pm Digital Edition : Idhi Nijam Desk

ఘనంగా సరస్వతి పూజ

*పోలిరెడ్డిపల్లి హై స్కూల్‌లో ఘనంగా సరస్వతి పూజ…*

మర్రిపాడు మండలంలోని పోలిరెడ్డిపల్లి ప్రభుత్వ హై స్కూల్‌లో శుక్రవారం సరస్వతి పూజ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.పాఠశాల ప్రధానోపాధ్యాయులు షేక్ మస్తాన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా విద్యాదేవి సరస్వతి దేవి చిత్రపటానికి పూజలు నిర్వహించి అనంతరం కేక్ కట్ చేశారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు పదవ తరగతి విద్యార్థులకు రాబోయే పబ్లిక్ పరీక్షలను ఎలా సమర్థవంతంగా రాయాలో సూచనలు అందించారు. పరీక్షల సమయంలో పాటించాల్సిన నియమాలు, చదువులో అనుసరించాల్సిన విధానాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు.అలాగే పదవ తరగతి విద్యార్థులు తమ తోటి విద్యార్థులకు పరీక్షల్లో విజయాన్ని సాధించాలని ఆకాంక్షిస్తూ ఆల్ ది బెస్ట్ తెలిపారు. అనంతరం విద్యార్థులకు పరీక్షలకు అవసరమైన సామాగ్రిని అందజేశారు.విద్యార్థులకు అందజేసిన పరీక్ష సామాగ్రిని కొమ్మి జయచంద్ర దానం చేయగా, మధ్యాహ్న భోజనాన్ని కుంభగిరి బాలచక్రధర్ మరియు మురళి గోపాల్ అందించారు.కార్యక్రమం అనంతరం మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేసి, తరువాత విద్యార్థులతో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించి ఉత్సాహభరిత వాతావరణంలో కార్యక్రమాన్ని కొనసాగించారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, సిబ్బంది మరియు విద్యార్థులు పాల్గొన్నారు.