గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబుపర్యటన

0
19

📰 Generate e-Paper Clip

 

 

గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు తేది 01.04.2026 నెల్లూరు జిల్లా వింజమూరు పర్యటన నేపథ్యంలో ఈ రోజు జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో జిల్లా ఎస్‌పి గారు SSG, జిల్లా అధికారుల సమక్షంలో అడ్వాన్స్ సెక్యూరిటీ లైజన్ (ASL) నిర్వహణ :ఏప్రిల్ 1న గౌరవ ముఖ్యమంత్రి వర్యుల నెల్లూరు జిల్లా వింజమూరు గ్రామంలోని జాగీరు వనంలో జరగబోయే పర్యటన నేపథ్యంలో, జిల్లా కలెక్టర్ శ్రీ హిమాన్షు శుక్లా గారు మరియు జిల్లా ఎస్‌పి డా. అజిత వేజెండ్ల, IPS గారు నేడు విస్తృత స్థాయి భద్రతా ఏర్పాట్లను ASL నిర్వహణ సందర్బంగా మరోసారి సమీక్షించారు.ఈ సందర్భంగా అధికారులు హెలిప్యాడ్, ట్యాంక్ బండ్ మరియు, పెన్షన్ పంపిణీ కేంద్రం, నార్త్ ఎస్సీ కాలనీ, ప్రజా వేదిక, స్టాల్స్, కార్యకర్తల సమావేశ స్థలాలను స్వయంగా సందర్శించి అక్కడ భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. ప్రతి ప్రదేశంలో భద్రతా బలగాల మోహరింపు, ప్రవేశ-నిష్క్రమణ మార్గాలు, అత్యవసర సేవల అందుబాటు వంటి అంశాలపై ప్రత్యేకంగా దృష్టి సారించలని ఆదేశాలు ఇచ్చారు.వింజమూరులోని MRO కార్యాలయం వెనుక ఏర్పాటు చేసిన ప్రజా వేదిక ప్రాంగణాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్ సదరు ప్రాంగణం ‘నో డ్రోన్ ఫ్లైయింగ్” డిక్లేర్ చేయడం జరిగింది. జిల్లా ఎస్‌పి గారు, పబ్లిక్ యాక్సెస్ కంట్రోల్, VIPల భద్రత, ట్రాఫిక్ నియంత్రణ, పార్కింగ్ ఏర్పాట్లు వంటి అంశాలలో కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.VVIP పర్యటన లో అవాంచిత ఘటన లు జరిగిన లేదా ప్రోగ్రాం అనుకోని మార్పులు చోటు చేసుకొంటే అమలు చేయాల్సిన కంటిన్జెన్స్ ప్రణాళికలు గురించి ఈ ASL నందు డిస్కస్ చేసి అధికారులకు తగు ఆదేశాలు జారీ చేసారు.ఈ పర్యటన రూట్ లో ఫైర్ వర్క్స్ నిషిద్దమని, VVIP గారు పర్యటనలో ఉండగా ఎలాంటి ఫైర్ క్రాకర్స్ కాల్చుటకు అనుమతి లేదని సెక్యూరిటీ పాయింట్ అఫ్ వ్యూ లో జిల్లా కలెక్టర్ గారు తెలపడం జరిగింది.అలాగే, హెలిప్యాడ్ ప్రాంతం వద్ద భద్రతా వలయాలను మరింత బలోపేతం చేయాలని, ప్రజా వేదిక మరియు కార్యకర్తల సమావేశ ప్రదేశాల్లో ప్రాపర్ యాక్సెస్ కంట్రోల్ తగిన బారికేడ్లు ఏర్పాటు చేయాలని సూచించారు. ట్యాంక్ బండ్, పార్క్ ప్రాంతాల్లో విద్యుత్ తీగలు సెక్యూర్ చేయాలని, VVIP ట్యాంక్ బండ్ ప్రవేశ మరియు నిష్క్రమించే ప్రదేశాలు పూర్తి స్థాయిలో ప్రిపేర్ అవ్వాలి అని సదరు ప్రదేశాలలో పర్యవేక్షణను పెంచి, అనుమానాస్పద కదలికలపై అప్రమత్తంగా ఉండాలని పోలీసు సిబ్బందికి సూచించారు.జిల్లా ఎస్‌పి డా. అజిత వేజెండ్ల గారు ఈ సందర్బంగా, ముఖ్యమంత్రి పర్యటన సజావుగా, ఎలాంటి అవాంతరాలు లేకుండా జరిగేలా అన్ని రకాల భద్రతా చర్యలు చేపట్టినట్లు తెలిపారు. ప్రతి అధికారి తనకు అప్పగించిన బాధ్యతలను కచ్చితంగా నిర్వహించాలని ఆదేశించారు.జిల్లా కలెక్టర్ శ్రీ హిమాన్షు శుక్లా గారు మాట్లాడుతూ, అన్ని శాఖలు సమన్వయంతో పని చేసి కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించాల్సిన అవసరం ఉందని, ముందస్తు ప్రణాళికల మేరకు అన్ని ఏర్పాట్లు పూర్తి సకాలంలో పూర్తి చేయాలని సూచించారు.ఈ రోజు 12.30 నుండి 14.45 వరకు జరిగిన ఈ ASL ప్రోగ్రాం లోఅడిషనల్ SP అడ్మిన్,SSG అడిషనల్ ఎస్‌పి శ్రీ SSV. కృష్ణారావు గారు,జాయింట్ కలెక్టర్ శ్రీ M వెంకటేశ్వర్లు IAS, SDPOs కావలి, నెల్లూరు టౌన్ , రూరల్, ఆత్మకూరు, గూడూరు, SB DSP శ్రీ A శ్రీనివాస రావు, AR DSP శ్రీ చంద్రమోహన్, హోమ్ గార్డ్ యూనిట్ DSP శ్రీ రమణ గారు, నెల్లూరు విమెన్ PS DSP శ్రీ సత్యనారాయణ గారు, ఒంగోలు విమెన్ PS DSP శ్రీ రమణ కుమార్ గారు, ఇంటలిజెన్స్ CI శ్రీ కిషోర్ బాబు గారు సంబంధిత సిఐలు, ఆర్‌ఐలు, అలాగే అన్ని సంబందించిన శాఖల అధికారులు పాల్గొన్నారు.

 

 

Leave a reply

Please enter your comment!
Please enter your name here