గురుదేవోభవ….
జిల్లా ఉత్తమ ఉపాధ్యాయురాలు అవార్డు గ్రహీత టీచర్ కృష్ణవేణి కి గ్రామస్తులు ప్రశంసలు….
మర్రిపాడు.(ప్రభాకర్ మేకల //ఇదినిజం బ్యూరో ఇంచార్జ్ ):
సెప్టెంబర్ 5వ తేదీ ఉపాధ్యాయ దినోత్సవంసందర్భంగానెల్లూరుజిల్లాకేంద్రంలోప్రతిష్టాత్మకమైన జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు కార్యక్రమం నిర్వహించారు.నెల్లూరు జిల్లా అల్లూరు మండలంలోని గొల్లపాలెం ప్రాథమిక పాఠశాలలో పనిచేయుచున్న మద్దిశెట్టి కృష్ణవేణి ఉపాధ్యాయురాలు ప్రతిష్టాత్మకమైన జిల్లా ఉత్తమ ఉపాధ్యాయులు అవార్డు ప్రశంస పత్రం జిల్లా కలెక్టర్ హిమాన్ శుక్లా, జిల్లా పరిషత్ చైర్మన్ ఆనం అరుణమ్మ, ఎమ్మెల్సీ బీద రవిచంద్ర చేతుల మీదుగా ఈ అవార్డు అందుకున్నారు.ఉత్తమ ఉపాధ్యాయురాలు గా మద్దిశెట్టి కృష్ణవేణి ని ప్రభుత్వం పురస్కారాలతోసత్కరించడంతో ఉపాధ్యాయురాలు మద్దిశెట్టి కృష్ణవేణి స్వగ్రామం మర్రిపాడు మండలం పడమటి నాయుడుపల్లి కావడంతో గ్రామస్తులలో ఆనందం నెలకొంది.మద్దిశెట్టి రమణయ్య రమణమ్మ గార్ల కుమార్తె ఉన్నత స్థితిని, ఆమె పొందిన గౌరవ ప్రదాన్ని చూసి గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థులకు తల్లిదండ్రులు జన్మనిస్తే, వారికి విద్యాబుద్ధులు నేర్పించి ఉన్నతులుగా తీర్చిదిద్దడంలో గురువులు మార్గదర్శకులుగా నిలుస్తున్నారని అ భాగ్యం టీచర్ కృష్ణవేణి కి దక్కిందని గ్రామస్తులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి కృషిచేస్తున్న గురువులు సదాస్మరణీయులని పేర్కొన్నారు.
*అమ్మానాన్నలను సన్మానించుకున్న ఉపాధ్యాయిని కృష్ణ వేణి అభినందనీయులు…..*
అందరికీ విభిన్నంగా ఎంతో కష్టపడి తనను చదివించి పెంచి పెద్ద చేసిన తన తల్లిదండ్రులకు ఈ అవార్డు అంకితం చేస్తూ అమ్మానాన్నలే తన తొలి గురువులని, నన్ను, మా చెల్లిని ఉపాధ్యాయురాలు గా ,మా తమ్ముడు అమెరికాలో ఆపిల్ కంపెనీలో సాఫ్ట్ వేర్ ఉద్యోగిగా స్థిరపడి వారు చూపిన మంచి మార్గంలో ఎంతోమంది మన్ననలను పొందుతూ విధులు నిర్వహిస్తున్నామని . నాకు వచ్చిన ఈ గుర్తింపును ,ఈ గౌరవాన్ని మా అమ్మ నాన్నల కు లభించిన గౌరవంగా వారికి ఈ అవార్డు అంకితం చేస్తూ అందరిలో వారిని ఇలా సన్మానించుకోవడం ఎంతో గర్వంగా ఆనందంగా ఉందని ఈ అవార్డును పొందడం వెనుక నా కృషితోపాటు మా శ్రీవారు, మా పిల్లలు, అధికారులు అభిమానులు గ్రామస్తులు విద్యార్థులు అందరి సహకారం ఉందని చెప్పడం ఆమె ఔన్నత్యానికి నిదర్శనం.
ఎంతో ప్రతిష్టాత్మకమైన జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు పొందిన ఉపాధ్యాయిని కృష్ణ వేణి తాను పొందిన అవార్డు తమ తల్లిదండ్రులు కు అంకితం చేయడం గర్వించదగ్గ విషయం.నూతన ఒరవడికి నాంది పలకడమే.