గుడ్లూరు వారి పాలెం లో పొలం పిలుస్తుంది కార్యక్రమంలో పాల్గొన్న….
జిల్లా వ్యవసాయ అధికారి పి సత్యవాణి
నెల్లూరు /వెంకటాచలం(ఇదినిజం ప్రతినిధి ):
మంగళవారం వెంకటాచలం మండలంలోని గుడ్లూరు వారి పాలెం గ్రామంలో జిల్లా వ్యవసాయ అధికారి పి సత్యవాణి పొలం పిలుస్తోంది కార్యక్రమం నిర్వహించారు. అందులో భాగంగా ఎల్లినో ప్రభావ నివారణ కార్యాచరణ ప్రణాళిక పై రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. బీడుగా ఉన్న పొలాల్లో పిఎండిఎస్ కిట్లువినియోగించుకోవాలని సూచించారు. జిల్లాలోని ప్రతి రైతు విశిష్ట గుర్తింపు సంఖ్య ( ఫార్మర్ ఐడి ) పొందాలని తెలిపారు ప్రతి రైతుకు ఆధార్ మాదిరిగా ఒక ప్రత్యేకమైన డిజిటల్ నెంబర్ను ప్రభుత్వం కేటాయిస్తుందన్నారు. విత్తనాలు, ఎరువులు, పంటల బీమా, ధాన్యం కొనుగోలు, పీఎం కిసాన్ వంటి పథకాలకు ఈ సంఖ్య ఎంతో ఉపయోగపడుతుందని తెలియజేశారు. ఈ గుర్తింపు సంఖ్య కోసం రైతులు ఆధార్ కార్డు మరియు ఆధార్కి లింక్ అయిన ఫోన్ నెంబర్ తీసుకొని గ్రామ వ్యవసాయ సహాయకులు (వి ఎ ఎ ) లను సంప్రదించాలని తెలిపారు ఈ కార్యక్రమంలో నెల్లూరు ఏడీఏ బి శ్రీదేవి మండల వ్యవసాయ అధికారి ఎస్ రామ మోహన్ వి ఏ ఏ ఎస్కే.రఫీ మరియు రైతులు పాల్గొన్నారు.