వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి చేతుల మీదుగా బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రిక విడుదల
మార్చి 28 నుండి ఉస్మాన్ సాహెబ్ పేట కోదండరామ స్వామి బ్రహ్మోత్సవాలుఏప్రిల్ 3న స్వామివారి కళ్యాణం.. 4న రథోత్సవంవైభవంగా నెల్లూరు 10వ డివిజన్ కోదండరామ స్వామి బ్రహ్మోత్సవాల సన్నాహాలు
నెల్లూరు నగరం 10వ డివిజన్, ఉస్మాన్ సాహెబ్ పేటలోని ప్రసిద్ధ శ్రీ కోదండరామ స్వామి ఆలయ బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రికను టీడీపీ నేత వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి నేడు ఘనంగా ఆవిష్కరించారు. ఈ ఏడాది బ్రహ్మోత్సవాలు మార్చి 28 నుండి ఏప్రిల్ 7 వరకు అత్యంత వైభవంగా జరగనున్నాయి. ఈ ఉత్సవాల్లో ప్రధాన ఘట్టాలైన ఏప్రిల్ 3న స్వామివారి కళ్యాణ మహోత్సవం, ఏప్రిల్ 4న రథోత్సవం అత్యంత వేడుకగా నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ ప్రకటించింది. ఈ పత్రికా ఆవిష్కరణ కార్యక్రమంలో దేవస్థాన కమిటీ చైర్మన్ బీవీ శ్రీనివాస్, కమిటీ సభ్యులు, 8 మరియు 10వ డివిజన్ల ప్రముఖులు పాల్గొని, భక్తులందరూ అధిక సంఖ్యలో విచ్చేసి స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించి కృపకు పాత్రులు కావాలని ఆలయ కార్య నిర్వహణ అధికారి దర్గయ్య కోరారు.ఈ కార్యక్రమంలో పదో డివిజన్ కార్పొరేటర్ కిన్నెర ప్రేమ్ కుమార్, 9వ డివిజన్ కార్పొరేటర్ రాజశేఖర్ , 14వ డివిజన్ కార్పొరేటర్ కర్తం ప్రతాప్ కుమార్ రెడ్డి స్థానిక టిడిపి ముఖ్య నేతలు నాయకులు తదితరులు పాల్గొన్నారు.