idhinijam.com
Newspaper Banner
Date of Publish : 22 September 2026, 7:49 am Digital Edition : Idhi Nijam Desk

కె. ఎన్. పల్లి అంగన్‌వాడీ కేంద్రంలో ఘనంగా పోషకాహార మాసోత్సవాలు…..

కె. ఎన్. పల్లి అంగన్‌వాడీ కేంద్రంలో ఘనంగా పోషకాహార మాసోత్సవాలు….

మర్రిపాడు.(ఇదినిజం ప్రతినిధి ):

మహిళలు, చిన్నారుల ఆరోగ్య సంరక్షణ కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అంగన్‌వాడీ కేంద్రాలను నిర్వహిస్తున్నాయి. గర్భిణులు, బాలింతలు, పిల్లల ఎదుగుదల కోసం ప్రభుత్వం కేంద్రాల ద్వారా పౌష్టికాహారం అందిస్తోంది. అయినప్పటికీ క్షేత్రస్థాయిలో రక్తహీనత, బరువు లోపాలు చెక్‌పెట్టి, పోషకాహారంపై అవగాహన కల్పించేందుకు మహిళా, శిశు సంక్షేమ శాఖ సెప్టెంబరు నెలను పోషణ మాసోత్సవంగా నిర్వహిస్తోంది.అందులో భాగంగా మర్రిపాడు మండల క్లస్టర్ పరిధిలోని కదిరి నాయుడుపల్లి అంగన్‌వాడీ కేంద్రంలో పోషకాహార మాసోత్సవ కార్యక్రమాన్ని అంగన్వాడీ సూపర్వైజర్ కే. నారాయణమ్మ ఆధ్వర్యంలో సోమవారం అత్యంత ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమం లో పడమటి నాయుడు పల్లి పంచాయతీ మజర గ్రామాల అంగన్వాడీ టీచర్లు సిహెచ్.పద్మావతి,బి రాజేశ్వరి, బి. నాగమ్మ, యు.ఝాన్సీ, బి. కృష్ణవేణి,కే. సుమలత, కే.కళ అత్యంత ఉత్సాహంగా పాల్గొని చిన్నారులు, గర్భిణులు, బాలింతలలో పౌష్టికాహార లోపాన్ని నివారించడం మరియు వారిలో ఆరోగ్యంపై అవగాహన కల్పించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా అంగన్‌వాడీ కేంద్రంలో ఏర్పాటు చేసిన వివిధ రకాల ఆకుకూరలు, కూరగాయలు, తృణధాన్యాలు, పండ్లు మరియు పోషక విలువలు గల ఆహార పదార్థాల ప్రదర్శన ఎంతగానో ఆకట్టుకుంది.కార్యక్రమంలో పాల్గొన్న సూపర్‌వైజర్ సూపర్వైజర్ కే. నారాయణమ్మ మరియు అంగన్‌వాడీ కార్యకర్తలు మాట్లాడుతూ..సమతుల్య ఆహారంతోనే సంపూర్ణ ఆరోగ్యం అని చిన్నారుల శారీరక, మానసిక ఎదుగుదలకు పౌష్టికాహారం ఎంతో అవసరమని తెలిపారు. రోజువారీ ఆహారంలో మునగాకు, తోటకూర వంటి ఆకుకూరలు, స్థానికంగా దొరికే పండ్లు, పప్పుధాన్యాలు మరియు గుడ్లను భాగం చేసుకోవాలని సూచించారు. గర్భిణులు, బాలింతలు రక్తహీనత బారిన పడకుండా ఐరన్, కాల్షియం లభించే ఆహారాన్ని తీసుకోవాలన్నారు. ప్రభుత్వం అంగన్‌వాడీల ద్వారా అందిస్తున్న పౌష్టికాహారాన్ని ప్రతీ ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో అంగన్‌వాడీ కార్యకర్తలు, ఆశా వర్కర్లు, స్థానిక మహిళలు, గర్భిణులు, బాలింతలు మరియు చిన్నారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.