idhinijam.com
Newspaper Banner
Date of Publish : 01 April 2026, 1:38 pm Digital Edition : Idhi Nijam Desk

కృపా సేవా చారిటబుల్ ట్రస్ట్ సొంత నిధులతో ప్రభుత్వ హాస్పిటల్ నందు రోగులకు బ్రెడ్, బిస్కెట్స్, వాటర్ బాటిల్స్, పంపిణీ*

గూడూరు పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులకు 01/04/2026 వ తేదీ బుధవారం రోజున కృప సేవా చారిటబుల్ ట్రస్ట్ సభ్యుల సహకారంతో అలాగే ఈరోజు ముఖ్య అతిథిగా విచ్చేసిన సి.డి.పి.ఒ. SK.మహబూబి చేతులమీదుగా బ్రెడ్,బిస్కెట్లు,వాటర్ బాటిల్స్ పంపిణీ చేశారు.ట్రస్ట్ అధ్యక్షుడు కటకం శ్రీనివాసులు మాట్లాడుతూ:- మా కృప సేవ చారిటబుల్ ట్రస్ట్ సభ్యుల యొక్క సొంత నిధులతో వెచ్చించి ప్రతి నెల ఒకటో తారీఖున గూడూరు ప్రభుత్వ హాస్పిటల్ లో ఉన్న పేషెంట్లకు బిస్కెట్లు,వాటర్ బాటిల్స్ ప్రతి నెల క్రమం తప్పకుండా పంపిణీ చేస్తున్న కార్యక్రమం మా ట్రస్ట్ సభ్యులు సహాయ సహకారాలతో ఈ ప్రోగ్రాం చేస్తున్నామని తెలియజేశారు దాదాపు 100 మంది రోగులకు బిస్కెట్లు మరియు బ్రెడ్, వాటర్ బాటిల్స్ పంపిణీ చేయడం మాకు ఎంతో ఆనందంగా ఉందని అలాగే ఈరోజు ముఖ్య అతిథిగా విచ్చేసిన సి.డి.పి.ఒ. SK.మహబూబి కి కృప సేవ చారిటబుల్ ట్రస్ట్ సభ్యుల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కృప సేవా చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షులు కటకం శ్రీనివాసులు, ఉపాధ్యక్షుడు అత్తి మంజరి గోపాల్, సభ్యులు కసుకుర్తి కోటేశ్వరరావు, పర్వతాల రమేష,పేయ్యల రమణయ్య, పెరిమేటి చెంచయ్య, చవల సురేంద్ర, కోడి శివ తదితరులు పాల్గొన్నారు.