* ఏబీఎన్ కార్యాలయంపై దాడి దుర్మార్గం.. తీవ్రంగా ఖండించిన మేకపాటి మాల్యాద్రి నాయుడు హైదరాబాద్‌లోని ఏబీఎన్ (ABN) ప్రధాన కార్యాలయంపై జరిగిన దాడిని మేకపాటి మాల్యాద్రి నాయుడు భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా నెల్లూరు జిల్లా ఉపాధ్యక్షుడు తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ప్రజాస్వామ్యంలో పత్రికలు, ప్రసార మాధ్యమాలపై దాడులు చేయడం అత్యంత హేయమైన చర్య అని మండిపడ్డారు. నిజాన్ని నిర్భయంగా ప్రజల ముందుకు తీసుకువస్తున్న ఆంధ్రజ్యోతి మీడియా గొంతు నొక్కాలని చూడటం, భౌతిక దాడులకు పాల్పడటం దుర్మార్గం అని పేర్కొన్నారు. పత్రికా స్వేచ్ఛపై జరిగిన ఈ దాడిని తీవ్రంగా పరిగణించాలని, దాడికి పాల్పడిన దుండగులను వెంటనే గుర్తించి వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.ఈ సమయంలో ఏబీఎన్ సంస్థకు, యాజమాన్యానికి, మరియు మనోధైర్యంతో విధులు నిర్వర్తిస్తున్న సిబ్బందికి ఆయన తన ప్రగాఢ సంఘీభావం తెలియజేశారు. భవిష్యత్తులో మీడియా సంస్థలపై ఇలాంటి దాడులు పునరావృతం కాకుండా ప్రభుత్వం తగిన భద్రత కల్పించాలని, మీడియా స్వేచ్ఛను కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉందని ఆయన స్పష్టం చేశారు.
కార్యాలయంపై దాడి దుర్మార్గం.. తీవ్రంగా ఖండించిన మేకపాటి మాల్యాద్రి నాయుడు
0
6

