idhinijam.com
Newspaper Banner
Date of Publish : 08 October 2026, 7:11 am Digital Edition : Idhi Nijam Desk

కఠినత్వం వెనుక కారుణ్యం…..

కాఠిన్యం వెనుక కారుణ్యం…..

మతిస్థిమితం లేని వ్యక్తికి మర్రిపాడు పోలీసులు ఆసరా:

కడప రిమ్స్ ఆసుపత్రికి తరలింపు…

మర్రిపాడు (ప్రభాకర్ మేకల /ఇదినిజం బ్యూరో ఇంచార్జ్ ):

గ్రామంలో గొడ్డలి చేత పట్టుకొని వీధులెంబడి తిరుగుతూ,మర్రిపాడు మండలం భీమవరం గ్రామస్తులను తీవ్ర భయభ్రాంతులకు గురిచేసిన స్థానిక మతిస్థిమితం లేని వ్యక్తి గాలిబోయిన మురళి (24)ని మర్రిపాడు పోలీసులు ఎంతో చాకచక్యంగా పట్టుకుని, మానవతా దృక్పథంతో కడప రిమ్స్ (RIMS) ఆసుపత్రికి తరలించి కఠినత్వం వెనుక కారుణ్యం కూడా ఉంటుందని మానవత్వం చాటుకున్నారు మర్రిపాడు పోలీసులు.గ్రామంలో గాలిబోయిన మురళి చేతిలో గొడ్డలి పట్టుకుని అందరినీ భయపెడుతున్నాడనే సమాచారంతో గ్రామస్తులు తీవ్ర ఆందోళనకు గురై పోలీసులకు ఫోన్ చేశారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. అయితే, సదరు వ్యక్తి పోలీసులను చూడగానే మరింత ఊగిపోతూ, వారిపైకే తిరగబడ్డాడు. పోలీసులు ఎంతో సమయస్ఫూర్తితో, ఎవరికీ ఎటువంటి గాయాలు కాకుండా అతడిని నియంత్రించి అదుపులోకి తీసుకున్నారు.ఆ వ్యక్తి ప్రవర్తనను గమనించిన పోలీసులకు అతడు మానసిక స్థితి సరిగ్గా లేక (మతిస్థిమితం తప్పి) అలా ప్రవర్తిస్తున్నాడని అర్థమైంది. అతడిపై కేవలం చట్టపరమైన చర్యలు తీసుకోవడమే కాకుండా, మానవత్వంతో స్పందించాలని స్థానిక సబ్ ఇన్స్పెక్టర్ బలరాంరెడ్డి సలహాతో పోలీసులు నిర్ణయించుకున్నారు. వెంటనే ఈ విషయాన్ని గౌరవ కోర్టు దృష్టికి తీసుకెళ్లి, న్యాయస్థానం సలహా మరియు జిల్లా ఎస్పీ అజిత్ వేజండ్ల ఆదేశాల మేరకు సదరు వ్యక్తిని మెరుగైన వైద్యం కోసం ఎఎస్ఐ నజీర్, కానిస్టేబుల్ వెంకట్ కడప రిమ్స్ ఆసుపత్రిలో చేర్పించారు.సమస్యను కేవలం శాంతిభద్రతల కోణంలోనే కాకుండా, మానవతా దృక్పథంతో ఆలోచించి, ఆ వ్యక్తికి సరైన వైద్యం అందేలా చేసిన మర్రిపాడు సబ్ ఇన్స్పెక్టర్ బలరాం రెడ్డి ని పోలీసుల చొరవను గ్రామస్తులతో పాటు పలువురు అభినందిస్తున్నారు.