కండలేరు, సోమశిల జలాశయాలకు సంబంధించి భూ సేకరణ ప్రక్రియ ను వేగవంతం చేసి భూములను సంబంధిత శాఖకు అందించేలా చర్యలు తీసుకోవాలి జిల్లా కలెక్టర్ సంబధిత అధికారులకు సూచించారు. బుధవారం స్థానిక కలెక్టర్ కార్యాలయములోని కలెక్టర్ వారి చాంబర్ నందు సోమశిల, కండలేరు ఇంజనీరింగ్ మరియు రెవిన్యూ అధికారులతో సమీక్ష సమవేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఆనం సంజీవయ్య బ్రాంచ్ కెనాల్ మరియ కే.జి.యం బ్రాంచ్ కెనాల్ కు సంబంధించి భూసేకరణ పూర్తి అయిన పిదప అవార్డ్ జారీచేయుటతో పాటు యజమానలుకు త్వరితగతిన పరిహారం చెల్లించాలన్నారు. అవసరమైన చోట అవార్డు జారీ తో పాటు నోటిఫికేషన్ విడుదల చేయాలని అన్నారు. ఇంకా పరిహారం చెల్లించకపోవుటకు గల కారణాలు అడిగితెలుసుకొన్నారు. అవసరమైన ప్రతిపాదనలు సిద్దం చేయాలన్నారు. భూ సేకరణకు సంబందిచి సర్వే నంబర్లు తో లబ్దిదారుల వివరాలను అందచేయాలన్నారు.
ఈ కార్యక్రామములో సోమశిల జలాశయ యస్.ఇ వెంకట రామణా రెడ్డి, తెలుగు గంగ స్పెషల్ కలెక్టర్ మురళి, స్పెషల్ కలెక్టర్ మహేందర్ రెడ్డి, వెంకటరెడ్డి, సంబంధిత మండల రెవిన్యూ అధికారులు పాల్గొన్నారు.