ఏఎస్పేట మండలంలో విజయవంతంగా ముగిసిన వి పి ఆర్ నేత్ర ధన్యవాదాలు తెలిపిన మండల ప్రజలు
ఏ ఎస్ పేట (ఇది నిజం ప్రతినిధి హరికృష్ణ) ఏ ఎస్ పేట మండలంలోని విపిఆర్ నేత్ర వైద్య శిబిరాలు శుక్రవారంతో దిగ్విజయంగా నిర్వహించి ముగించారు. గత రెండు రోజులుగా మండల కేంద్రంలో ఉన్న ప్రజలకు వీపిఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో కంటి చూపు పరీక్షలు నిర్వహించి ఉచితంగా కంటి అద్దాలు అందించారు.ఈ సందర్భంగా మండల టిడిపి నాయకులు మాట్లాడుతూ రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, ఆదేశాల మేరకు మొదటిగా ఏఎస్ పేట మండలంలోని చిరమణ పంచాయతీ లో విపిఆర్ నేత్ర శిబిరాలు ప్రారంభించి ఏఎస్పేట పంచాయతీలో ముగింపు జరిగిందన్నారు.చీఫ్ కోఆర్డినేటర్,విపిఆర్ నేత్ర బస్ ఇంచార్జ్,ఎన్.శంకర్ ఆధ్వర్యంలో మండలంలోని 19 గ్రామ పంచాయతీలలో వి పి ఆర్ నేత్ర ద్వారా 5921 మందికి కంటి పరీక్షలు నిర్వహించి,,3003 మందికి ఉచిత కంటి అద్దాలు పంపిణీ చేయడం జరిగింది అన్నారు.ఈ కార్యక్రమంలో మండల టిడిపి నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వి పి ఆర్ ఫౌండేషన్ ద్వారా పేద ప్రజలకు కంటి చూపును అందించాలని ఏర్పాటు చేసిన వి పి ఆర్ నేత్ర కార్యక్రమాన్ని చేపట్టిన ఎంపి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి,కి మహోన్నతమైన కార్యక్రమం చేపట్టినందుకు మండల ప్రజలు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు