idhinijam.com
Newspaper Banner
Date of Publish : 06 July 2026, 10:15 am Digital Edition : Idhi Nijam Desk

ఈరోజు 116 ఏళ్ల వయసుగల వృద్ధ భక్తురాలికి VIPదర్శనం కల్పించిన టిటిడి

*ఈ రోజు 116 ఏళ్ల వృద్ధ భక్తురాలు శ్రీమతి నవనీతమ్మ గారికి, ఆమె కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారి ప్రత్యేక విఐపీ బ్రేక్ దర్శనం 

అనంతరం రంగనాయకుల మండపంలో టీటీడీ ఈఓ శ్రీ ముద్దాడ రవిచంద్ర గారు వేదపండితులతో వేదాశీర్వచనం చేయించి, పట్టువస్త్రం కప్పి, తీర్థప్రసాదాలు అందజేశారు. నవనీతమ్మ గారికి నమస్కరించి ఆశీర్వాదం కూడా తీసుకున్నారు.ఈ సందర్భంగా నవనీతమ్మ గారి మనవడు దిక్పతీ మాట్లాడుతూ, “మా అమ్మమ్మ కోరికను నెరవేర్చి, మా కుటుంబ సభ్యులందరికీ శ్రీవారి దర్శన భాగ్యం కల్పించిన టీటీడీకి, టీటీడీ చైర్మన్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు.” అని తెలిపారు.నవనీతమ్మ గారిని గుర్తించడంలో తమ వంతు సహకారం అందించిన సోషల్ మీడియా మిత్రులందరికీ, అలాగే వెంటనే స్పందించి ఆమెను గుర్తించిన టీటీడీ విజిలెన్స్ అధికారులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు