idhinijam.com
Newspaper Banner
Date of Publish : 29 March 2026, 7:57 pm Digital Edition : Idhi Nijam Desk

ఆత్మగౌరవ నినాదానికి 44 వసంతాలు

*ఆత్మగౌరవ నినాదానికి 44 వసంతాలు….*కటారి రమణయ్య.*ఏపీ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ బోర్డ్ డైరెక్టర్.*

మర్రిపాడు.(👉ప్రభాకర్ మేకల /✍️/ఇదినిజం బ్యూరో ఇంచార్జ్✍️ ):*

తెలుగువారి ఆత్మగౌరవ నినాదంతో పురుడు పోసుకున్న తెలుగుదేశం పార్టీ 44 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్బంగా ఆదివారం టీడీపీ ఆవిర్భావ రోజు. 45వ ఏట అడుగు పెడుతోన్న వేల మర్రిపాడు మండలం చుంచులూరు గ్రామంలో ఏపీ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ బోర్డ్ డైరెక్టర్. కటారి రమణయ్య.ఆధ్వర్యంలోక్లస్టర్ ఇంచార్జ్ కర్యావుల శ్రీనివాసులు యాదవ్, మండలం కార్యదర్శి పడచల శ్రీనివాస్ యాదవ్ , గ్రామ కమిటీ అధ్యక్షులు,మన్నే కొండారెడ్డి, కర్యావుల యంగయ్య,

ఎలగాల వెంకటేశ్వర్లు యాదవ్ సీనియర్ నాయకులు,టీడీపీ నాయకులు విజయభాస్కర్ రెడ్డి, బిఎల్ఏ ముద్దనూరు రమణయ్య పాల్గొని కార్యకర్తలు తో కలిసి టీడీపీ పార్టీ జండా ఆవిష్కరించారు.ఈ సందర్బంగా ఏపీ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ బోర్డ్ డైరెక్టర్. కటారి రమణయ్య.మాట్లాడుతూ చరిత్రలో ఒక ప్రాంతీయ పార్టీ నాలుగున్నర దశాబ్దాల ప్రయాణం అంటే.. ఓ సంచలనమే.అన్నారు బలమైన జాతీయ పార్టీలే కాలంతో పాటు మారలేక, కొత్త తరాన్ని ఆకట్టుకోలేక కనుమరుగైపోతున్న కాలంలో ఒక ప్రాంతీయ పార్టీ ఎన్నో ఆటుపోట్లను తట్టుకుని ఇన్నేళ్లు నిలబడటం మామూలు విషయం కాదని . అందులోనూ దాదాపు సగం కాలం అంటే.. 21 ఏళ్లపాటు ప్రతిపక్షంలోనే ఉండి 2009 నుంచి 2014 వరకు ప్రతిపక్షంలో ఉండటం ఒక సవాల్‌ అయితే, 2019 నుంచి 2024 వరకు మరో సవాల్‌.

టీడీపీ కార్యకర్తలు, నాయకులు సమ్మెట దెబ్బలతో రాటుతేలినట్టు మరింత ఉత్సాహంతో పార్టీని అధికారంలోకి తెచ్చేందుకు కృషి చేశారు. అద్భుతమైన విజయం సాధించారు. 1995 సంక్షోభం మొదలు.. ఇక పార్టీ పని అయిపోయిందనుకున్న ప్రతిసారీ పార్టీని, క్యాడర్‌ను కంటికి రెప్పలా కాపాడుకుంటూ వచ్చి పార్టీని నిలబెట్టిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందని కొనియాడారు టీడీపీ ఆవిర్భావంలోనే వైవిధ్యం ఉంది. ఆరు పదుల వయసులో ప్రాంతీయ పార్టీని స్థాపించడమే సాహసం అయితే, అప్పుడే పురుడు పోసుకున్న పార్టీలో ఉద్దండులైన రాజకీయ నాయకుల కన్నా కొత్తగా రాజకీయాల్లోకి రావాలనుకునే యువకులకు ప్రాధాన్యమిచ్చి టికెట్లు ఇవ్వడం ఎన్టీఆర్‌ చేసిన మరో సాహసం. అప్పటి వరకు రాజకీయం అంటే కేవలం కొన్ని సామాజికవర్గాలకే పరిమితం. కానీ ఎన్టీఆర్‌ రాజకీయ సమీకరణాలను మార్చేశారు. విద్యావంతులకు, దళితులకు, బీసీలకు ప్రాధాన్యమిచ్చారు. 1983లో టీడీపీ తరఫున పోటీ చేసిన అభ్యర్థుల్లో 28 మంది పోస్టు గ్రాడ్యుయేట్లు, 20 మంది వైద్యులు, 47 మంది న్యాయవాదులు, 8 మంది ఇంజనీర్లు, 128 మంది పట్టభద్రులు ఉన్నారు. రాజకీయాల్లో విద్యావంతులు, దళితులు, వెనుకబడిన వర్గాలకు ప్రాధాన్యం దక్కింది టీడీపీ ఆవిర్భావం తర్వాతేనని విశ్వాసం వ్యక్తం చేశారు.