idhinijam.com
Newspaper Banner
Date of Publish : 10 October 2026, 7:06 am Digital Edition : Idhi Nijam Desk

అగ్ని ప్రమాద బాధిత కుటుంబానికి కేజీబీవీ అండ – రూ. 20వేల ఆర్థిక సాయం….

అగ్ని ప్రమాద బాధిత కుటుంబానికి కేజీబీవీ అండ – రూ. 20వేల ఆర్థిక సాయం….

మర్రిపాడు.(ఇదినిజం ప్రతినిధి ):

ప్రమాద వసాత్తు అగ్నిప్రమాదంలో ఇల్లు కాలి సర్వస్వం కోల్పోయిన బాధిత కుటుంబానికి కేజీబీవీ ఉపాధ్యాయ బృందం సిబ్బంది, పాఠశాల విద్యా కమిటీ రూ. 20,000 ఆర్థికసాయంఅందించిమానవత్వాన్నిచాటుకున్నారు.మర్రిపాడు మండలం పడమటి నాయుడుపల్లి పంచాయితీ మజర అనంతపురం గ్రామానికి చెందిన యన్నం దేవి ఇల్లు ప్రమాద వసాత్తు వారం క్రితం అగ్ని ప్రమాదానికి గురై నిలువనీడ తప్ప సర్వస్వము కోల్పోయి నిరాశ్రయులుగా మిగిలారు. కేజిబివి స్కూల్ లో 8 వ తరగతి చదువుతున్న బాధిత మహిళ కుమార్తె ద్వారా తెలుసుకున్న పాఠశాల ప్రిన్సిపాల్ సిహెచ్ లక్ష్మీదేవి వెంటనే స్పందిస్తూ అర్ధక సహకారం అందించాలని నిర్ణయించుకొని ఉపాధ్యాయ బృందానికి మరియు విద్యాకమిటీ కి సమాచారం చేరవేశారు వాళ్ళు సహకరించడం తోఅగ్నిప్రమాదంలో ఇల్లు కాలి నిరాశ్రయురాలైన మహిళ కేజీబీవీ విద్యార్థిని తల్లి దేవికి ఆర్థిక సాయం మొత్తంరూ. 20,000/- వేల రూపాయలు సాయం అందించి మానవత్వం చాటుకున్నారు.విపత్కర పరిస్థితుల్లో ఉన్న ఒక పేద కుటుంబానికి, అందునా తమ స్కూల్ విద్యార్థిని తల్లికి పెద్ద మనసుతో ఆర్థిక సాయం అందించి ఆదుకున్న ప్రిన్సిపాల్ ,మరియు పాఠశాల ఉపాధ్యాయ బృందానికి కమిటీ చైర్మన్ సభ్యులుకు స్థానికులు, విద్యాశాఖ అధికారులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. తమకు కష్టకాలంలో అండగా నిలిచి సాయం అందించిన కేజిబివి స్కూల్ ప్రిన్సిపాల్ లక్షిదేవి కి మరియు కేజిబివి స్కూల్ విద్యా కమిటి చైర్మన్ మాలపాటి సుబ్బానాయుడు, మరియు సభ్యులు అయిన యడ్ల పల్లి రాధయ్య, చాగం సుబ్బారెడ్డి, గంగిరెడ్డి చెన్న క్రిష్ణా రెడ్డి మరియు పాఠశాల బోధనా సిబ్బంది అందరికి బాధిత మహిళ కన్నీటి పర్యంతమై కృతజ్ఞతలు తెలిపారు.