– సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ ఆధ్వర్యంలో ‘ అంతర్జాతీయ మహిళా దినోత్సవం’ పై అవగాహన నెల్లూరు రూరల్ (ఇది నిజం)
:ఆంధ్రప్రదేశ్ గిరిజన సంక్షేమ బాలికల గురుకుల పాఠశాల కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖకు చెందిన సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ (CBC), నెల్లూరు క్షేత్ర కార్యాలయం గురువారం నిర్వహించిన ‘ అంతర్జాతీయ మహిళా దినోత్సవం’’ కార్యక్రమంలో సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ (CBC) ప్రతినిధి పి.హరికృష్ణ మాట్లాడుతూ మార్చి 8వ తేదీన అంతర్జాతీయ మహిళా దినోత్సవంలో భాగంగా ఈరోజు అనగా మార్చి 5వ తేదీన గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలలో అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగిందని, ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం మహిళలకు అన్ని రంగాల్లో సహాయ సహకారాలు అందిస్తూ కేంద్ర ప్రభుత్వ పథకాల ద్వారా వారికి చేయూతని అందించి వాళ్ళని ఆర్థికంగా ఎదిగేలా ప్రోత్సహిస్తుందని, అదేవిధంగా శాస్త్ర సాంకేతిక విద్య వైద్య ఉపాధి రంగాల్లో కూడా ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం మహిళలకు ప్రత్యేక స్థానం కల్పిస్తుందని అన్నారు.
సీనియర్ జర్నలిస్టు అనుముల జయప్రకాష్ గారు మాట్లాడుతూ ప్రతి ఒక విద్యార్థి బాగా చదివి తల్లిదండ్రులకు దేశానికి మంచి పేరు తీసుకురావాలని అదేవిధంగా భారత ప్రభుత్వం మహిళలకు అన్ని రంగాల్లో ప్రత్యేక స్థానం కల్పిస్తుందని అనగా ఆర్మీ ఎయిర్ ఫోర్స్ మరియు అన్ని రంగాలలో ప్రత్యేక స్థానం కల్పిస్తున్నారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా దేశభక్తి గీతాలు మరియు వకృత్వ పోటీలలో గెలుపొందిన విద్యార్థినులకు బహుమతులు మరియు ప్రైజ్ మనీ అందజేశారు, వైస్ ప్రిన్సిపాల్ వి గాయత్రి, బోధన మరియు బోధనేతర సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

